వీటిని తింటున్నారా? అయితే మీకు హార్ట్ ఎటాక్ రావడం ఖాయం..

First Published Oct 2, 2022, 1:04 PM IST

ఈ మధ్య కాలంలో గుండెపోటు రోగుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. యువకులు కూడా హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. అయితే కొన్ని రకాల ఆహారాలు కూడా గుండె పోటుకు దారితీస్తాయి. అందుకే వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. 
 

heart attack

ఈ రోజుల్లో హార్ట్ పేషెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. చిన్న వయసు వారు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుండె జబ్బులకు కొన్ని రకాల ఆహారాలు, పానీయాలు కూడా దారితీస్తాయి. గుండె పోటు రాకుండా ఉండేందు వేటిని తినకూడదు..గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వేటిని తినాలో తెలుసుకుందాం పదండి. 

అనారోగ్యకరమైన కొవ్వు 

శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ధమనుల్లో ఫలకం ఏర్పడుతుంది. దీనినే అథెరోస్క్లెరోసిస్ అంటారు. ఇది గుండెపోటుకు, స్ట్రోక్ కు దారితీస్తుంది. అందుకే నెయ్యి వంటి ట్రాన్స్ ఫ్యాట్ లను ఉపయోగించడం మానుకోండి. అలాగే ఉపయోగించిన నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగించడం మానుకోండి. నిపుణుల ప్రకారం.. సంతృప్త కొవ్వును రోజుకు 10 శాతం కంటే తక్కువగా తీసుకోవాలి. 
 

కుకీలు, కేకులు

కుకీలు, కేకులు, ఫ్రాస్టింగ్స్, చిప్స్ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఒకవేళ తిన్నా పక్కాగా వాటి లేబుల్స్ ను చెక్ చేయండి. ఎందుకంటే వీటిలో పోషక విలువలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఆరోగ్యాన్ని దెబ్బతీసే కొన్ని ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి.
 

ఒకే రకమైన నూనె 

ఒకే రకమైన నూనెను ఉపయోగించడం వల్ల కూడా గుండె జబ్బులు వస్తాయి. అందుకే వంట నూనెను తరచుగా మార్చాలి. ఉదాహరణకు పొద్దుతిరుగుడు నూనె, సోయాబీన్ నూనె, ఆలివ్ ఆయిల్ లేదా ఆవనూనెను ఉపయోగించండి. మీరు ఏ నూనెను ఉపయోగిస్తున్నారు అన్న దానితో సంబంధం లేకుండా, అన్ని రకాల నూనెలలో కేలరీలు అధికంగా ఉంటాయి. కాబ్బటి నూనెను ఎక్కువగా ఉపయోగించకండి. 
 

ఉప్పు పరిమాణాన్ని తగ్గించండి

ఉప్పును ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు పెరిగే ప్రమాదముంది. ఈ రక్తపోటు కాస్త హృదయ సంబంధ వ్యాధులకు దారితీస్తుంది. ఆరోగ్యకరమైన గుండె కోసం ఉప్పు తీసుకోవడం చాలా వరకు తగ్గించాలి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రతి ఆరోగ్యకరమైన వయోజనుడు రోజుకు 2,300 మిల్లీగ్రాముల (మి.గ్రా) సోడియం (సుమారు ఒక టీస్పూన్) కంటే ఎక్కువ తినకూడదని సిఫార్సు చేస్తుంది.
 

Vegetables

పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినండి

కూరగాయలు, పండ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇలాంటి పండ్లను, కూరగాయలను తినడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.  మీ రెగ్యులర్ డైట్ లోంచి మాంసం, జున్ను, స్నాక్స్ వంటి అధిక కేలరీల ఆహారాన్ని తగ్గించండి. ఇవి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. 
 

తృణధాన్యాలు 

తృణధాన్యాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిలో రక్తపోటును తగ్గించే, గుండె ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కానీ తెల్లని, ప్రాసెస్ చేసిన పిండి, వైట్ బ్రెడ్, మఫిన్లు,  కార్న్ బ్రెడ్, డోనట్స్, బిస్కెట్లు, క్విక్ బ్రెడ్లు, కేకులు,  ఎగ్ నూడుల్స్, బటర్ పాప్కార్న్ లకు దూరంగా ఉండాలి.
 

protein rich foods

ప్రోటీన్ ఫుడ్ ను పెంచండి 

ప్రోటీన్ కంటెంట్ మాంసం, పౌల్ట్రీ, చేపలతో సహా పాల ఉత్పత్తులు, గుడ్డలో పుష్కలంగా ఉంటుంది.  కొన్ని రకాల చేపల్లో ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గిస్తాయి. అవిసె గింజలు, వాల్ నట్స్,  సోయాబీన్స్ లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. బీన్స్, బఠాణీలు, కాయధాన్యాలలో కొవ్వు తక్కువగా ఉంటుంది. అందుకే ఇవి మాంసానికి మంచి ప్రత్యామ్నాయాలు. 

click me!