ఆరోగ్యానికి మంచిదని బీట్ రూట్ జ్యూస్ ను అతిగా తాగితే మీ పని అంతే..

First Published Oct 2, 2022, 11:58 AM IST

బీట్ రూట్ జ్యూస్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగని అతిగా తాగితే మాత్రం ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.  
 

బీట్ రూట్ లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవన్నీ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలో ఉండే ఐరన్ కంటెంట్  శరీరంలో రక్త కణాలను పెంచుతుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ ను కూడా పెంచడానికి సహాయపడతుంది. దీనిలో ఉండే ఖనిజాలు, విటమిన్లు  ఎన్నో రకాల అనారోగ్య  సమస్యలను తగ్గిస్తాయి. అలాగని బీట్ రూట్ జ్యూస్ ను అతిగా తాగితే మాత్రం.. దీనిలో ఉండే ఆక్సలేట్ కిడ్నీల్లో రాళ్లను ఏర్పరుస్తుంది. అందుకే కిడ్నీల్లో రాళ్లున్నవారు బీట్ రూట్ జ్యూస్ ను తాగకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. 

అలెర్జీ సమస్య ఉన్నవారు కూడా బీట్ రూట్ కు దూరంగా ఉండాలి. ఎందుకంటే అలెర్జీ సమస్య ఉన్నవారు వీటిని తీసుకుంటే కూడా అలెర్జీ వచ్చే అవకాశం పెరుగుతుంది. దీనివల్ల గొంతు బిగుతుగా మారుతుంది. 

రెడ్ కలర్ లో ఉండే ఆహారాలు లేదా బీట్ రూట్ ను అతిగా తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల బీటూరియా వస్తుంది. అంటే మూత్రం రెడ్ కలర్ లో వస్తుంది. రెడ్ కలర్ కూరగాయల్లో ఉండే నైట్రేట్ల వల్ల పొత్తికడుపు నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. 

గర్భిణులు బీట్ రూట్ లను అతిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే దీనిలో ఉండే నైట్రేట్ల వల్ల  చేతులు, పెదాలు, కాళ్ల చర్మ రంగు మారుతుంది. అలాగే కళ్లు తిరుగుతాయి. తలనొప్పి కూడా వస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బీట్ రూట్ జ్యూస్ ను ఎక్కువగా తాగడం వల్ల కాలెయం దెబ్బతింటుంది. అలాగే శరీరంలో కాల్షియం లెవెల్స్ కూడా బాగా తగ్గిపోతాయి. దీంతో ఎముకలు బలహీనపడతాయి. అందుకే బీట్ రూట్ ను మోతాదుకు మించి తీసుకోకండి. 

ఇకపోతే బీట్ రూట్ జ్యూస్ ను మోతాదులో తాగితే శరీరం శక్తివంతంగా మారుతుంది. దీనిలో ఉండే ఐరన్ కంటెంట్ రక్తకణాల సంఖ్యను పెంచుతుంది. అలాగే అధిక రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుంది. దీనిలో విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం, కాల్షియం లు పుష్కలంగా ఉంటాయి. బీట్ రూట్ ను మోతాదులో తింటే గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది.  ఈ జ్యూస్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. గర్భిణులు ఈ జ్యూస్ ను తరచుగా కొంత పరిమాణంలో తాగితే కడుపులో బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతాడు. ఈ జ్యూస్ మెమోరీ పవర్ ను పెంచుతుంది. ఎముకలను గట్టిగా చేస్తుంది. అలాగే ఇది ఏకాగ్రతను కూడా పెంచుతుంది. 

click me!