నవరాత్రి ఉపవాసం ఉంటున్నారా? అయితే ఈ పానీయాలు తాగండి.. బలహీనతనేదే ఉండదు..

First Published Oct 2, 2022, 11:07 AM IST

నవరాత్రుల్లో  ఉపవాసం ఉండేవారి శరీరానికి ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు అవసరమవుతాయి. ఇలాంటి సమయంలో కొన్ని పానీయాలను తాగితే బలహీనత, అలసట మటుమాయం అవుతాయి. అవేంటంటే.. 
 

నవరాత్రి సందర్భంగా అమ్మవారికి ఉపవాసం ఉండేవారు చాలా మందే ఉన్నారు. ఈ నవరాత్రుల్లో ఉపవాసం ఉండేవారు ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసం, గుడ్లు, ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. ఇలాంటి సమయంలో తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంంది. అయినా ఉపవాసం వల్ల శరీరంలో శక్తి తగ్గుతుంది. దీనివల్ల బలహీనంగా తయారవుతారు. ఉపవాసం ఉండేవారికి ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు అవసరమవుతాయి. లేదంటే బలహీనంగా మారి ఏ పనికూడా చేతకాదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఉపవాస సమయంలో శరీరం హైడ్రేట్ గా ఉండాలి. ఇలా ఉండాలంటే హెల్తీ పానీయాలను. పండ్లను తీసుకోవాలి. ఉపవాసం ఉండేవారు తీసుకోవాల్సిన హెల్తీ డ్రింక్ ఏంటో తెలుసుకుందాం పదండి. 

ABC జ్యూస్

ఉపవాసం ఉండేవారు తప్పకుండా తీసుకోవాల్సిన పానీయాల్లో ABC జ్యూస్ ముందు ప్లేస్ లో ఉంటుంది. ఎబిసి  జ్యూస్ ను ఆపిల్, దుంపలు, క్యారెట్ లతో తయారు చేస్తారు. ఈ డిఫరెంట్ కాంబినేషన్ లో ఉన్న  ఈ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఆపిల్, దుంపలు, క్యారెట్ లో ఎన్నో రకాల విటమిన్లు, ఫైబర్స్, యాంటీ  ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. అధిక రక్తపోటును కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. ఈ పానీయం బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే కళ్లు, చర్మం ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం తొక్క తీసిన ఆపిల్ పండు, సగం బీట్ రూట్, ఒక క్యారెట్, ఒక కప్పు నీటిని గ్రైండర్ లో వేసి జ్యూస్ చేసుకోవాలి. దీనికి తేనే కలిపి తాగితే టేస్టీగా ఉంటుంది. 
 

సిట్రస్ ఫ్రూట్ జ్యూస్

సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. సిట్రస్ పండ్లైన నిమ్మ, నారింజ,  ద్రాక్ష వంటి పండ్లన్నీ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండ్లన్నింటిలో ఉండే హెస్పెరిడిన్ అధిక రక్తపోటు లక్షణాలను తగ్గిస్తుంది. వీటిలో ఉండే పెక్టిన్ ఫైబర్, లిమోనాయిడ్ సమ్మేళనాలు రక్తనాళాలు గట్టిపడకుండా నిరోధిస్తాయి. దీంతో ఎల్డిఎల్ స్థాయిలను తగ్గుతాయి. సిట్రస్ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఈ జ్యూస్ మిమ్మల్ని రీఫ్రెష్ గా ఉంచుతాయి. దీని కోసం నారింజ, నిమ్మకాయలను మిక్స్ చేసి జ్యూస్ గా తయారుచేయండి. ఈ జ్యూస్ జీర్ణక్రియ సక్రమంగా పనిచేసేందుకు సహాయపడుతుంది. 
 

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్ షేక్ కూడా మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది.  డై ఫ్రూట్స్ లో బాదం, పిస్తా, వాల్ నట్స్ లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, జింక్, పొటాషియం, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తారు. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే జీర్ణక్రియను పెంచడానికి సహాయపడుతాయి. దీనికోసం ముందుగా వాల్ నట్స్, బాదం, పిస్తా, జీడిపప్పు, జీడిపప్పులను ఒక్కొక్కటి రెండు టీస్పూన్ల చొప్పున తీసుకుని బ్లెండర్ లో వేయాలి. తరువాత దానికి కొన్ని ఖర్జూరాలు , బాదం పాలు కలపండి.

click me!