ఈ ఫుడ్స్ లో చక్కెర ఎక్కువగా ఉంటుంది.. బరువు తగ్గాలనుకునేవారు వీటికి దూరంగా ఉండటమే మంచిది..

First Published | Aug 30, 2022, 12:54 PM IST

షుగర్ మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీన్ని ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతో పాటుగా బరువు కూడా పెరుగుతారు. అందుకే బరువు తగ్గాలనుకునేవారు షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. 

కొంతమందికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇలాంటి వారే భోజనం తర్వాత పక్కాగా స్వీట్లను లాగిస్తుంటారు. కానీ షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాలు శరీరానికి చేసే మేలు కంటే చెడే ఎక్కువగా ఉంటుంది. అవును చక్కెర ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. అందుకే డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చక్కెరను తక్కువగా తీసుకోవాలని సలహానిస్తుంటారు. మరి మనం తినే కొన్ని రకాల ఆహారపదార్థాల్లో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి. దీనివల్ల శరీరంలోని భాగాలపై చెడు ప్రభావం పడుతుంది. ఇంతకీ చక్కెర ఏయే ఆహారాల్లో ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం పదండి.. 

పెరుగు

బరువు తగ్గడానికి లేదా శారీరాన్ని దృఢంగా ఉంచడానికి చాలా మంది పెరుగును ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అందులో తక్కువ కొవ్వు ఉన్న పెరుగునే తింటారు. ఈ తక్కువ కొవ్వు పెరుగులో చక్కెర కూడా ఉంటుందని బహుషా మీకు తెలియకపోవచ్చు. పెరుగులో తక్కువ కొవ్వుతో పాటుగా  ప్రోబయోటిక్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ తక్కువ కొవ్వు ఉన్న పెరుగు మనకు అందుబాటులో ఉంటుంది. కానీ తక్కువ కొవ్వు ఉన్న పెరుగులో చక్కెర పరిమాణం సున్నా అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. మీరు గమనించారో లేదో ఈ పెరుగు తియ్యగా ఉంటుంది. అంటే దీనిలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. అందుకే బరువు తగ్గాలనుకునేవారు తక్కువ కొవ్వు పెరుగును తినకండి. 
 


ప్యాకెజ్డ్ జ్యూస్ లు

బరువు తగ్గేందుకు చాలా మంది జ్యూస్ లను ఎక్కువగా తాగుతుంటారు. జ్యూస్ లో ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ.. మార్కెట్ లో లభించే ప్యాకెజ్డ్ జ్యూస్ లను మాత్రం తాగకండి. ఎందుకంటే వారు జ్యూస్ లల్లో షుగర్ కంటెంట్ ను ఎక్కువగా యాడ్ చేస్తారు. నిజంగా మీరు బరువు తగ్గాలనుకుంటే లేదా మీ ఆహారంలో షుగర్ ఉండకూడదని భావించినా.. మార్కెట్ లో పండ్లను కొని ఇంట్లో జ్యూస్ ను తయారుచేసుకుని తాగండి.

ఎనర్జీ డ్రింక్స్

పనిచేసే వారు చాలా మంది ఎనర్జీ డ్రింక్ లను రోజూ తాగుతుంటారు. కానీ వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు దీనిలో కెఫిన్ కూడా ఉంటుంది. ఈ రెండు బరువు తగ్గాలనుకునేవారి ఏ మాత్రం మంచివి కావు. అందుకే బరువు తగ్గాలనుకుంటే ఎనర్జీ డ్రింక్ లకు దూరంగా ఉండండి.

సాస్ 

సాస్ లు అంటే ఇష్ట పడని వారుండరు. కెచప్, బార్బెక్యూ సాస్, సలాడ్ డ్రెస్సింగ్ లేదా పాస్తా సాస్ లు చాలా మంది ఇళ్లలో ఎప్పుడూ కనిపిస్తాయి. మీకు తెలుసా కేవలం 2 టేబుల్ స్పూన్ల సాస్ లో 16 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది మీకు తెలియకుండానే మీ శరీర బరువును ఫాస్ట్ గా పెంచుతుంది. ఇది శరీరాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఆరోగ్యంగా ఉంటూ.. బరువు తగ్గాలనుకుంటే మాత్రం సాస్ ల జోలికి వెళ్లకండి. 

Latest Videos

click me!