మీరు ఇష్టపడుతున్న వ్యక్తి మిమ్మల్ని లవ్ చేస్తున్నాడో.. లేదో ఇలా తెలుసుకోండి..

Published : Jan 23, 2022, 04:37 PM IST

మనసుకు నచ్చిన వ్యక్తి కళ్ల ముందరుంటే ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. కానీ మీరు ప్రేమిస్తున్నా.. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నాడో లేదో అన్న విషయాన్ని వారినే నేరుగా అడగడం కొంచెం మొహమాటం కలిగించే విషయమే. అందుకే వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారో లేదో కొన్నింటి ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. అదెలాగంటే..   

PREV
16
మీరు ఇష్టపడుతున్న వ్యక్తి మిమ్మల్ని లవ్ చేస్తున్నాడో.. లేదో ఇలా తెలుసుకోండి..

ఒక వ్యక్తి మనసుకు నచ్చితే చాలు అతని కోసం ఏం చేయడానికైనా  సిద్దమైపోతుంటారు. అందులోనూ తొలి చూపులోనే ఒక వ్యక్తిపై అమితమైన ప్రేమను పెంచుకునే వారు చాలా మందే ఉన్నారు. దాన్నే Love at first sight అంటుంటారు. అలాంటి వ్యక్తులు ఎంతమందిలో ఉన్నా అతనికోసం మనచూపులు వెతుకులాటలు మొదలు పెడతాయి. అయితే ఒక వ్యక్తిని మీరు ఇష్టపడుతున్నారు సరే కానీ అవతలి వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నాడా లేదా అనే అనుమానం అయితే పక్కాగా ఉంటుంది. మరి ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నాడని అతన్నే అడిగి నిర్దారించుకోలేరుగా. ఒకవేళ మీరు అడిగినా అతను మీకు వ్యతిరేకంగా ఆన్సర్ చేస్తే చాలా బాధపడతారు. అలాంటప్పుడు అతను మిమ్మల్ని లవ్ చేస్తున్నాడో లేదో కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

26


ఒకవ్యక్తి మిమ్మల్ని అమితంగా ఇష్టపడితే అతని గురించి ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారు. ఎక్కువగా మీతో సమయాన్ని గడపడాన్ని కోరుకుంటారు. ఇలా గనుక మీతో ఎవరైనా బిహేవ్ చేస్తే వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు. ఒకవేళ మీ ఇద్దరి మధ్యన ఏదైన అడ్డంకిగా భావిస్తే దాన్ని కూడా విడిచిపెట్టడానికి సిద్దంగా ఉంటారు. 

36


 మిమ్మల్ని ప్రేమించే వాళ్లు మీతో కళ్లద్వారా కూడా సంభాషిస్తుంటారు. వారి చూపులే మీపై ఉన్న ప్రేమను , ఇష్టాన్ని వ్యక్తపరుస్తాయి. కళ్ల ద్వారా తమ హావ భావాలను కమ్యూనికేట్ చేసే వారు కొన్ని రోజుల తర్వాత తమ భావాలను మీతో షేర్ చేసుకుంటారు. మీపై స్పెషల్ ఇంట్రెస్ట్ ను చూపిస్తుంటారు. 
 

46


కనుబొమ్మలు కూడా మీపై ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తాయి. ఒక వ్యక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు తరచుగా కనుబొమ్మలను పైకి లేపితే అతనికి మీపై అమితమైన ప్రేమ ఉందని అర్థం చేసుకోవాలి. ఇలా కనుబొమ్మలు పైకెత్తే విషయాన్ని అంత తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే కనుబొమ్మలు పైకెత్తేది కేవలం మనం హ్యాపీగా ఫీలైనప్పుడే. అలా అని అందరినీ కలిసినప్పుడు ఇలాంటి ఫీలింగ్ రాదు. కేవలం మన మనసుకు నచ్చిన వ్యక్తి దగ్గరున్నప్పుడే ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది. సో ఇలా చేస్తే కూడా అవతలి వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నాడని అర్థం. 

56

अगर आपकी भी रिश्ता पक्का हो गया है, सगाई हो चुकी है तो आपको शादी तक कुछ बातों का खास ध्यान रखना चाहिए। ऐसा इसलिए क्योंकि इससे आपका रिश्ता मजबूत रहता है और वो कभी नहीं टूटता है।

66


ఒకవ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నాడని అతని కాళ్లు కూడా చెప్తాయి. ఎలాగంటే ఒక వ్యక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు అతని కాళ్లు మీ వైపు ఉంటాయి. ఇలా ఉంటే అర్థం మీరు కూడా అతని వైపు దృష్టిని పెట్టాలని. అలాంటి వ్యక్తులు మీకోసం ఎంతో ఆరాటపడుతుంటారు. బాడీ లాంగ్వేజ్ కూడా ఒక వ్యక్తి ఇష్టపడుతున్నాడా లేదా అనే విషయాన్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా మీరు ఎలా ప్రవర్తితే ఆటోమెటిగ్ గా మిమ్మల్ని ఇష్టపడే వారు కూడా అలాగే ప్రవర్తిస్తుంటారు. వారి ప్రవర్తనలో మార్పుకు మీరే కారణం. మీలా మారే వారు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారని అర్థం చేసుకోవాలి. 

Read more Photos on
click me!

Recommended Stories