అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్ లో ఆకర్షనియమైన ప్రాంతాలు ఏవో తెలుసా?

First Published Jan 23, 2022, 4:50 PM IST

అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) రాజధాని అయిన ఇటానగర్ (Itanagar) హిమాలయాల దిగువ ప్రాంతాల వద్ద ఉంది. ఇటానగర్ లో అనేక ప్రదేశాల ప్రజలు నివాసం ఉండడంతో దీనిని మినీ భారత దేశంగా పిలుస్తారు. ఇటానగర్ లో పురావస్తు ప్రదేశాలు, చారిత్రాత్మక, సామాజిక సాంస్కృతిక సంస్థలు ఉన్నాయి. ఈ నగరంలో ప్రధాన ఆకర్షణీయ  ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

ఇటానగర్ లో ప్రధాన ఆకర్షణగా (Attractive) ఇటా పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ మ్యూజియం, ఇటానగర్ వన్యప్రాణుల అభయారణ్యం, గంగా సరస్సు, జూలాజికల్ పార్క్, ఇందిరా గాంధీ పార్క్, పోలో పార్క్ ఇలా మొదలగు ఇతర ప్రదేశాలు ఉన్నాయి. అలాగే అనేక ప్రసిద్ధిచెందిన విద్యా సంస్థలు (Educational Institutions) కూడా ఉన్నాయి.
 

1974 వ సంవత్సరం నుంచి ఈ నగరం అరుణాచల్ ప్రదేశ్ కి రాజధాని (Capital) నగరంగా ఉంది. ఈ నగర వాతావరణం (Weather) ఎల్లప్పుడూ ఉల్లాసంగాను, అందంగానూ ఉంటుంది. కనుక ఇక్కడి సందర్శనీయ ప్రదేశాలు పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ ప్రదేశాలను సందర్శించడానికి అనేక మంది పర్యాటకులు వస్తుంటారు.
 

ఇటా పోర్ట్: ఇటానగర్ లో ప్రధాన ఆకర్షణ కేంద్రంగా ఇటా పోర్ట్ (Ita port) ఉంది. ఇటానగర్ ఆ పేరు ఈ పోర్ట్ నుండి వచ్చింది. ఈ పోర్టు నగరం నడిబొడ్డున ఉంది. కనుక పర్యాటకులు సందర్శించడానికి వీలుగా ఉంటుంది. ఈ పోర్ట్ చరిత్ర 14-15 వ శతాబ్దానికి చెందినది. మాయాపూర్ రాజు రామచంద్ర పరిపాలన కాలం నాటి ఇటుకలను (Bricks) ఉపయోగించి ఈ పోర్టు నిర్మాణం జరిగిందని కొందరు చరిత్రకారులు చెబుతారు.
 

అహోం భాషలో (Ahom language) ఇటుకలను ఇటా (Ita) అని పిలుస్తారు. అందువల్ల ఈ పోర్ట్ కు ఇటా పోర్ట్ అని పేరు వచ్చింది. ఇటా పోర్ట్ ను నిర్మించేందుకు 80 లక్షల కంటే ఎక్కువ ఇటుకలను ఉపయోగించారు. ఈ పోర్టు సందర్శన పర్యటనలను ఆకట్టుకునేలా ఉంటుంది.
 

గంగా సరస్సు: ఇటా నగర్ లో మరొక ప్రధాన ఆకర్షణగా గంగా సరస్సు (Ganga Lake) ఉంది. గంగా సరస్సును గేకర్ సేన్యిక్ అని కూడా పిలుస్తారు. ఇటా నగర్ కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ సరస్సు ఉంది. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం, పచ్చని అడవి మొక్కలు ఆకట్టుకునేలా ఉంటాయి. ఇక్కడ బోటింగ్ సదుపాయం (Boating facility), పరిసర ప్రాంతాల్లో స్విమ్మింగ్ పూల్ మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.
 

జవహర్లాల్ నెహ్రూ మ్యూజియం: ఇటానగర్ లో 1980వ సంవత్సరంలో జోహార్ లాల్ నెహ్రూ మ్యూజియాన్ని (Jawaharlal Nehru Museum) స్థాపించారు. మ్యూజియంలో దుస్తులు, ఆభరణాలు, ఆయుధాలు, శిరోభూషణము, సంగీత పరికరాలు, హస్తకళా, మతపరమైన వస్తువులను ప్రదర్శింపబడతాయి. ఇటానగర్ కి ప్రధాన ఆకర్షణీయ కేంద్రంగా ఈ మ్యూజియం ఉంది.
 

ఇటానగర్ లో పార్క్స్: ఇటానగర్ లో మూడు ప్రసిద్ధి చెందిన పార్కులు ఉన్నాయి. అవి ఇందిరా గాంధీ పార్క్ (Indira Gandhi Park), పోలో పార్క్, జూలాజికల్ పార్క్ (Zoological Park). ఈ పార్కుల సందర్శనలో వివిధ రకాల జంతుజాలం, పక్షులు, చెట్లు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ప్రయాణికులు స్థానిక ప్రజలు విశ్రాంతికిగాను ఈ పార్కులను సందర్శిస్తారు.

click me!