Back Pain: తీవ్రమైన నడుమునొప్పిని తగ్గించే చిట్కాలివిగో..

First Published Jan 23, 2022, 3:52 PM IST


Back Pain: ఈ మధ్యకాలంలో  వయసుతో సంబంధం లేకుండా చాలా మంది తీవ్రమైన నడుమునొప్పితో బాధపడుతున్నారు. 40 ఏండ్ల వయసు వారి నుంచి మొదలు పెడితే.. 25 ఏండ్ల వయసున్న వారు సైతం ఈ నడుమునొప్పితో తెగ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే.. 

Back Pain: మారుతున్న జీవనశైలి, ఒకే దగ్గర ఎక్కువ సేపు కూర్చోవడం, వ్యాయామాలు చేయకపోవడం వంటి వివిధ కారణాల వల్ల వెన్నునొప్పి వస్తుంది. తక్కువ వయస్సు వారు సైతం ఈ నడుము నొప్పి బారిన పడటం బాధాకరం. కాగా ఈ వెన్నునొప్పితే బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ నొప్పి నుంచి బయటపడేందుకు వేల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. అయినా ఈ సమస్య నుంచి శాశ్వంతంగా బయటపడిన వారు చాలా తక్కువనే చెప్పాలి. కాగా ఈ నొప్పి బారిన ఆఫీసుల్లో ఏసీల కింద కూర్చొని పనిచేసే వారి నుంచి నిరంతరం కష్టించే శ్రామికుల పడుతున్నారు. యువత, మధ్యవయస్కులు,  వృద్ధులు అంటూ అందరూ ఈ వెన్నునొప్పి బారిన పడుతున్నారు. ఈ నొప్పి మన వ్యక్తిగత జీవితంపై చాలా ప్రభావం చూపుతుంది. అయితే ఈ నొప్పికి ప్రధాన కారణం ఒకటి మన జీవన శైలి అయితే మరోటి కండరాలు జారడం వల్ల కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నొప్పినుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి.. అవేంటంటే.. 

ఎక్కువసేపు కూర్చోవడం: ప్రస్తుత కాలంలో చాలా మంది కంప్యూటర్స్ లోనే వర్క్ చేస్తున్నారు. దీంతో వారు గంటల తరబడి కంప్యూటర్ ముందు కోర్చోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాళ్లు కూర్చొనే పద్దతి సరిగ్గా ఉండాలి. లేదంటే నడుము నొప్పి సమస్య వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు మానిటర్ మీ కళ్లకు సమానంగా, తలభాగం సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే మానిటర్ కు కళ్లకు 20 అంగుళాల దూరం ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. కూర్చీలో కూర్చున్నప్పుడు మీ వెన్నెముక నిటారుగా ఉండేట్టు జాగ్రత్తపడాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కుర్చీ వెనకభాగానికి మీ నడుము తాకేలా చూసుకోవాలి. వీపు దగ్గర దిండును పెట్టుకుంటే కూడా నడుము నొప్పి రాదు. పని మధ్య మధ్యలో లేచి అటు ఇటు తిరగండి.
 

ব্যাক পেইন


డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తప్పని సరి. డ్రైవింగ్ లో ఉన్నప్పుడు మీ నడుమును వంచకుండా స్ట్రెయిట్ గా ఉండేట్టు చూసుకోవాలి. అలా అని నడుమును ముందుకు, వెనక్కి అస్సలు వంచకుండా చూసుకోవాలి. అలాగే మీ పాదాలు సరిగా తాకేలా బ్రేక్, క్లచ్ లు ఉండేట్టు చూసుకోవాలి. ఎక్కువ సేపు డ్రైవింగ్ చేయకూడదు. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవడం మంచిది.
 

back pain

ఎక్కువ మొత్తంలో బరువులను ఎత్తకూడదు. అందులోనూ బరువులను ఎత్తే సమయంలో నడుమును వంచకుండా జాగ్రత్త పడాలి. నడుముకు బదులుగా మోకాళ్లను వంచండి. అలాగే బరువులను ఎత్తేటప్పుడు పక్కవారి సాయం తప్పకుండా తీసుకోవాలి. ఇకపోతే బ్యాగులను మోయాల్సి వస్తే.. ఒక చేతితో మోయకుండా రెండు చేతులతో బరువును సమతూకంగా మోయాలి. బ్యాగులను ఎక్కువ దూరం మోయాల్సి వస్తే చేతులను మార్చుతూ బ్యాగును మోయండి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు తక్కువ లగేజీ ఉండేట్టు చూసుకోండి. ఇకపోతే ఇల్లు ఊడిచేటప్పుడు లేదా తుడిచేటప్పుడు పొడవుగా ఉండే చీపురులనే వాడండి. 

ఏదైనా పనిచేసేటప్పుడు నడుముకు బదులుగా మోకాళ్లను వంచండి. ఇండ్లను తుడిచేటప్పుడు  మోకాళ్లను నేలకు ఆనించి తుడవండి. అలా చేస్తే బరువు మొత్తం నడుముపై పడే అవకావం ఉండదు. వీటితో పాటుగా రోజుకు కనీసం 10 నుంచి 15 నిమిషాలు ఖచ్చితంగా నడుముకు సంబంధించిన ఎక్సర్ సైజ్లు చేయాలి. ఎత్తు చెప్పులకు బదులుగా ఫ్లాట్ గా ఉండే వాటిని ఉపయోగించండి. నడుము నొప్పిని తగ్గించడంలో కర్పూరం బాగా ఉపయోగపడుతుంది. అయితే నడుము నొప్పి తీవ్రంగా వేధిస్తుందని ఎక్కువ టాబ్లెట్లను వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. 
 

click me!