గుండె ఆరోగ్యానికి అద్భుతమైన ఆరోగ్య సూత్రం.. ఇది పాటిస్తే అద్భుత ఫలితం?

Navya G   | Asianet News
Published : Jan 23, 2022, 03:35 PM IST

క్యాప్సికంను (Capsicum) బెంగళూరు మిర్చి, బెల్ పెప్పర్, సిమ్లా మిర్చి ఇలా అనేక విధాలుగా పిలుస్తారు. మార్కెట్లో మనకు పసుపు, ఎరుపు వంటి క్యాప్సికంలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ మిర్చి కారంగా ఉండదు. క్యాప్సికంలో మినరల్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అని వైద్యులు చెబుతున్నారు. మరి క్యాప్సికంను తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల (Health benefits) గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

PREV
110
గుండె ఆరోగ్యానికి అద్భుతమైన ఆరోగ్య సూత్రం.. ఇది పాటిస్తే అద్భుత ఫలితం?

క్యాప్సికంలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, కెరోటినాయిడ్స్, ఫైబర్, కాపర్, జింక్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ (Antifungal), యాంటీ బ్యాక్టీరియల్ (Antibacterial) వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి.

210

కంటి ఆరోగ్యానికి మంచిది: కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఎ (Vitamin A) క్యాప్సికంలో పుష్కలంగా ఉంటుంది. కనుక క్యాప్సికంను తీసుకుంటే కంటి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు రేచీకటి (nyctalopia) వంటి సమస్యలు తగ్గుతాయి. క్యాప్సికంలో ఉండే కెరొటినాయిడ్స్ వయసు పైబడటంతో వచ్చే దృష్టి లోపాలను తగ్గిస్తాయి.

310

గుండె ఆరోగ్యానికి మంచిది: ఎరుపు రంగు క్యాప్సికంలో లైకోపీన్ (Lycopene) పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తాయి. గుండెకు హాని కలిగించే హీమోసైటనీన్ ను తగ్గించడానికి ఇందులోని బి6, పొలేట్  సహాయపడి గుండె ఆరోగ్యాన్ని (Heart health) మెరుగుపరుస్తాయి.

410

వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది: క్యాప్సికంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి వ్యాధులతో పోరాడే సామర్ధ్యాన్ని అందించి వ్యాధి నిరోధక శక్తిని (Immunity) పెంచుతాయి. క్యాప్సికం శరీరానికి మంచి ఎనర్జీ బూస్టర్ (Energy booster) గా సహాయపడుతుంది.

510

అనీమియా సమస్యను తగ్గిస్తుంది: క్యాప్సికం తీసుకునే ఆహారం నుండి ఐరన్ (Iron) ను సులువుగా గ్రహించడానికి సహాయపడుతుంది. కనుక అనేమియా (Anemia) సమస్యలతో బాధపడేవారు ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

610
হজম ক্ষমতা

শীতে বদহজমের সমস্যা নতুন নয়। এই সমস্যা থেকে বাঁচতে ক্যাপসিকাম খান। নিয়মিত ক্যাপসিকাম খেলে বাড়বে হজম ক্ষমতা। রোজ খাদ্যতালিকায় রাখুন ক্যাপসিকাম। এতে বাড়বে হজম ক্ষমতা। ক্যাপসিকামের তৈরি পদ রাখুন রোজের খাদ্যতালিকায়।  

710

క్యాన్సర్ ను అడ్డుకొంటుంది: క్యాప్సికంలో యాంటీఇన్ఫ్లమేటరీ (Antiinflammatory) లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని క్యాన్సర్ కణాలతో సమర్థవంతంగా పోరాడి క్యాన్సర్ (Cancer) ను అడ్డుకుంటాయి. ఈ విధంగా క్యాప్సికం క్యాన్సర్ కు విరుగుడుగా సహాయపడుతుంది.

810

ఉదర సమస్యలను తగ్గిస్తుంది: క్యాప్సికంలో ఫైబర్ (Fiber) పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తి (Digestion) సామర్ధ్యాన్ని పెంచి, కడుపు అల్సర్లు, కడుపులో వికారం, గ్యాస్ సమస్యలు వంటి ఉదర సమస్యలను తగ్గించి ఉదర భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

910

మధుమేహం: రక్తంలో చక్కెర స్థాయిలు (Sugar levels) తొందరగా కలవకుండా క్యాప్సికం అడ్డుకుంటుంది. దీంతో రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించి మధుమేహం (Diabetes) ఉన్న వారికి మేలు చేస్తుంది.
 

1010

ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది: క్యాప్సికంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్ (Fungal Infection), బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ (Bacterial Infection) లను నివారించడానికి సహాయపడుతాయి. కనుక క్యాప్సికంను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

click me!

Recommended Stories