Eclipses in 2026: ఈ ఏడాది వచ్చే సూర్య, చంద్ర గ్రహణాల తేదీలు ఇవే

Published : Jan 08, 2026, 05:30 PM IST

Eclipses in 2026: కొత్త ఏడాదిలో సూర్య గ్రహణాలు, చంద్ర గ్రహణాలు ఎన్ని రాబోతున్నాయి? ఎప్పుడు వస్తున్నాయి? ఇక్కడ వివరించాము. హిందూ మతంలో సూర్య, చంద్ర గ్రహణాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. 

PREV
14
2026 వచ్చ గ్రహణాలు

భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు ఏర్పడే గ్రహణాలు. శాస్త్రీయంగా ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. సాధారణంగా గ్రహణాలు మనకు అరుదుగా కనిపిస్తాయి. అందుకే ప్రతి గ్రహణం కూడా ప్రజల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. 2026లో సంపూర్ణ సూర్యగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతున్నాయి. వీటిని వీక్షించేందుకు శాస్త్రవేత్తలు కూడా సిద్ధమైపోతున్నారు. 2026లో వచ్చే సూర్య గ్రహణాలు, చంద్ర గ్రహణాల గురించి ఇక్కడ ఇచ్చాము.

24
గ్రహణాలు రాబోతున్న రోజులు

2026లో మొదటిసారి ఫిబ్రవరి 17న సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణంలో చంద్రుడు సూర్యుడిని కప్పేస్తాడు. సూర్యుడు ప్రకాశవంతమైన ఉంగరంలా గుండ్రంగా కనిపిస్తాడు. దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు. ఆ తర్వాత మార్చి 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో చంద్రుడు.. భూమి నీడలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల ఎరుపు రంగులో కనిపిస్తాడు. దీనినే బ్లడ్ మూన్ అని అంటారు. ఇక ఆగస్టు 12న మరొక విశేషమైన సూర్యగ్రహణం రాబోతుంది. దీన్ని అరుదైన ఖగోళ సంఘటనగా చెబుతారు. ఈ గ్రహణ సమయంలో కొన్ని నిమిషాల పాటు పగలు కూడా చీకటిగా మారే అవకాశం ఉంది. ఇక చివరిగా ఆగస్టు 28న చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణంలో చంద్రుడి సగభాగం భూమి నీడలోకి వస్తుంది. మిగతా సగభాగమే కనిపిస్తుంది.

34
గ్రహణాలు ఎలా ఏర్పడతాయి?

సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఎలా ఏర్పడతాయో తెలుసుకునేందుకు ఎంతో మందికి ఆసక్తి ఉంటుంది. చంద్రుడు, భూమికి చాలా దగ్గరగా తిరుగుతూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో సూర్యుడు - భూమి మధ్యలోకి చంద్రుడు వచ్చేస్తాడు. అప్పుడు సూర్యకాంతి భూమిపై పడకుండా ఉంటుంది. దీనినే సూర్యగ్రహణం అంటారు. ఇక భూమి.. సూర్యుడు - చంద్రుడు మధ్యలోకి వచ్చినప్పుడు చంద్రుడు భూమి నీడలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు చంద్రగ్రహణం ఏర్పడిందని అంటారు. ఈ గ్రహణాల ద్వారా శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. గ్రహణాలకు ఖగోళ శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యం ఉంది.

44
గ్రహణాలు మంచివి కావా?

ఇక భారతీయ సంప్రదాయాల్లో హిందూ మతంలో కూడా గ్రహణాలకు ప్రత్యేక స్థానం ఉంది. పూర్వకాలం నుంచి గ్రహణాలను శుభ కోణంలోనూ, అశుభకోణంలోనూ కూడా చూసేవారు. గ్రహణ సమయంలో పూజలు చేయరు. గుడి తలుపులు కూడా మూసేస్తారు. అలాగే గ్రహణం ముగిశాక తలకు స్నానం చేస్తూ ఉంటారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం గ్రహణాలు కేవలం ఒక సహజ ఖగోళ ప్రక్రియ అని చెబుతారు. వీటివల్ల భూమికి గానీ, భూమిపై నివసించే మనుషులకు కానీ ఎలాంటి ప్రత్యక్ష హాని ఉండదని అంటారు. అలాగే చంద్రగ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడవచ్చని ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతారు. సూర్య గ్రహణాన్ని మాత్రం నేరుగా చూడకూడదు. వీటికి ప్రత్యేక రక్షణ ఇచ్చే కళ్ళజోళ్ళు ఉంటాయి. వాటితోనే చూడడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories