Psychology Facts: ప్రతి మాటలో డబుల్ మీనింగ్ వెతికే వారి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా?

Published : Jan 08, 2026, 02:59 PM IST

సాధారణంగా కొందరు ఒక మాట వింటే దాని అర్థాన్ని మాత్రమే గ్రహిస్తారు. మరికొందరు ప్రతి మాటలో డబుల్ మీనింగ్ వెతుకుతారు. ఎదుటివారు అమాయకంగా మాట్లాడినా సరే ఆ మాటలను వక్రీకరించి నవ్వుతుంటారు. ఇలాంటి వాళ్ల గురించి సైకాలజీ ఏం చెప్తోందో తెలుసా?

PREV
16
Psychology Facts about Human Thinking

సైకాలజీ ప్రకారం.. మనం విన్న మాటలు, చూసిన సంఘటనలు మన మానసిక స్థితికి అద్దం లాంటివి. ఒక వ్యక్తి నిరంతరం ప్రతి మాటలో తప్పుడు అర్థాలు మాత్రమే చూస్తుంటే.. అది అతని మాటలతోనే కాదు, అతని ఆలోచనా విధానం, భావోద్వేగాలు, జీవిత అనుభవాలతో కూడా ముడిపడి ఉంటుంది. మన మెదడు ఏ విషయాలపై ఎక్కువగా దృష్టి పెడుతుందో, అదే తరహా అర్థాలను మనం బయట ప్రపంచంలో వెతుక్కుంటామని సైకాలజీ చెబుతోంది.

26
కాగ్నిటివ్ బయాస్

సైకాలజీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలాంటి ప్రవర్తనకు ప్రధాన కారణం ‘కాగ్నిటివ్ బయాస్’. అంటే ఒక వ్యక్తి మనసులో ఇప్పటికే ఉన్న ఆలోచనలు, నమ్మకాలు, కోరికలు అతను వినే ప్రతి మాటను అదే కోణంలో అర్థం చేసుకునేలా చేస్తాయి. ఎవరి మనసులోనైనా చెడు ఆలోచనలు ఎక్కువగా ఉంటే, సాధారణ మాటల్లో కూడా అతనికి అలాంటి అర్థాలే కనిపిస్తాయి.

36
మనసులో ఉన్నకోరికలు

నిపుణులు ప్రకారం మరో ముఖ్యమైన కారణం భావోద్వేగ అసంతృప్తి లేదా మనసులో ఉన్న కోరికలు. కొన్ని సందర్భాల్లో వ్యక్తి జీవితంలో ఎమోషనల్ గా వెలితి ఉంటే.. ఆ లోటు వారి ఆలోచనల్లో ప్రతిఫలిస్తుంది. అప్పుడు తెలియకుండానే చెడు అర్థాల వైపు ఆకర్షితులవుతారు. 

సైకాలజీ నిపుణుల ప్రకారం అణచివేసిన కోరికలు ఎక్కువగా ఉన్నప్పుడు అవి ప్రత్యక్షంగా కాకపోయినా, మాటల అర్థాల్లో, జోకుల్లో, వ్యాఖ్యల్లో బయటపడతాయి. ఈ ప్రవర్తన కొన్నిసార్లు వ్యక్తికి తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చినా, దీర్ఘకాలంలో అతని మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

46
పెరిగిన వాతావరణం

సైకాలజీ ప్రకారం ఒక వ్యక్తి పెరిగిన వాతావరణం, ఎక్కువగా చూసే సినిమాలు, వినే జోకులు, స్నేహితుల మాటల వంటివి వారి ఆలోచనా సరళిని తీర్చిదిద్దుతాయి. అసభ్యకరమైన హాస్యం, చెడు మాటలు సాధారణంగా మాట్లాడే వాతావరణంలో ఉన్నవారు, అదే సహజమని భావిస్తారు. అలాంటి వారికి ప్రతి మాటలో డబుల్ మీనింగ్ వెతకడం సాధారణ అలవాటుగా మారుతుంది.

56
ఎదుటి వారిని తక్కువ చేయడానికి..

సైకాలజీ విశ్లేషణల ప్రకారం, కొన్ని సందర్భాల్లో కొందరు.. ఎదుటి వ్యక్తిని తక్కువగా చేసి చూపించడానికి, మాటలను నియంత్రించడానికి లేదా తన వైపు దృష్టి ఆకర్షించడానికి కూడా ఉద్దేశపూర్వకంగా తప్పుడు అర్థాలు వెతుకుతారు. ఇలా చేయడం వల్ల వారు తమలోని లోపాలను దాచుకున్నామనే తప్పుడు భద్రతా భావాన్ని పొందుతారు. 

66
మార్పు సాధ్యమే..

ప్రతి మాటలో తప్పుడు అర్థాలు వెతకడం ఒక మానసిక అలవాటు మాత్రమే, సరైన అవగాహనతో, ఆత్మపరిశీలనతో మార్పు సాధ్యమే. ఆలోచనలపై నియంత్రణ సాధించగలిగితే, మాటల్ని సానుకూలంగా అర్థం చేసుకోవడం నేర్చుకోవచ్చు. ధ్యానం, పుస్తక పఠనం, సానుకూల వ్యక్తులతో మెలగడం వంటి అలవాట్లు ఆలోచనా సరళిని మార్చడంలో సహాయపడతాయని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories