చాలా మందికి గోర్లపై తెల్లని మచ్చలు వస్తుంటాయి. ఇవి కామనే.. వస్తుంటాయి.. పోతుంటాయని వీటిని ఎవరూ పట్టించుకోరు. నిజానికి ఇవి రావడానికి విటమిన్ల లోపమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మన శరీరంలో వచ్చే ప్రతి మార్పుకు ఖచ్చితంగా ఏదో ఒక బలమైన కారణం ఉందంటారు ఆరోగ్య నిపుణులు. కానీ ఈ మార్పులను ఎవరూ పట్టించుకోరు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు.
28
కామన్ గా అందరూ లైట్ తీసుకునే సమస్యల్లో గోర్లపై తెల్లని మచ్చలు ఒకటి. ఊరికే వచ్చిపోతుంటాయిలే ఇవి అని వీటిని పట్టించుకోని వారు చాలా మందే ఉన్నారు. అయితే దీనికి వెనుక బలమైన కారణాలున్నాయంటున్నారు నిపుణులు.
38
ప్రముఖ న్యూట్రిషనిస్ట్ నమామి అగర్వాల్ ఒక వీడియాలో ఈ సమస్య గురించి చెప్పారు. ఆమె అభిప్రాయం ప్రకారం.. గోర్లపై ఎందుకు తెల్లని మచ్చలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
48
శరీరంలో ఖనిజాలు, విటమిన్ల లోపం కారణంగానే గోర్లపై తెల్లని మచ్చలు ఏర్పడతాయని న్యూట్రిషనిస్ట్ నమామి అగర్వాల్ అంటున్నారు.
58
గోర్ల ఆరోగ్యానికి వివిధ రకాల పోషకాలు అవసరం అవుతాయి. గోర్లకు కొన్ని రకాల పోషకాలు అందకపోవడంతోనే వీటిపై తెల్లని మచ్చలు ఏర్పడుతుంటాయి. అందులో కాల్షియం, జింక్ లోపాలు ప్రధాన కారణాలు. గోర్లు మామూలు స్థితికి రావాలంటే జింక్, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి.
68
చేపలు, గుడ్లు, చిక్కుళ్లు, నట్స్, విత్తనాల్లో జింక్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటుగా రాగులు, నువ్వులు, పాలు, పాల ఉత్పత్తుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల గోర్లపై తెల్లని మచ్చలు పోతాయి.
78
ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడంతో పాటుగా గోర్లను కొరికే అలవాటును మానుకోవాలి. ముఖ్యంగా గోర్లను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
88
అయితే గోర్లకు తెల్లమచ్చలు.. కాళ్లకు సరిపోని షూస్ ను వేసుకోవడం వల్ల ఒత్తిడి పడినా, గోర్లపై గాయాలైనా ఏర్పడతాయి. పారిశ్రామిక రంగంలో పనిచేసే వ్యక్తులకు కూడా గోర్లపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. ఎందుకంటే వీరిగోర్లకు లోహాలు అంటుకోవడం గోర్ల రంగు పాలిపోతుంది.