అవొకాడో (Avocado)
అవొకాడో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల శరీరకక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీనిలో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి6, నియాసిన్, రిబోఫ్లేవిన్, ఫోలెట్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి నుంచి తక్షణమే ఉపశమనం కలిగిస్తాయి. అవొకాడో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతాయి. అధిక రక్తపోటును కూడా తగ్గిస్తాయి. ఊబకాయాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ పండును రోజూ తింటే మీ ఆరోగ్యానికి ఏ రోగ ప్రమాదం ఉండదు.