జుట్టు రాలిపోతూనే ఉందా.. ఈ సూపర్ టిప్స్ ట్రై చెయ్యండి!

Published : Jul 21, 2022, 02:20 PM IST

వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిలో జుట్టురాలే సమస్య (Hair fall problem) అధికమవుతుంది. ఇలా జుట్టు అధిక మొత్తంలో రాలిపోయి పలుచగా, నిర్జీవంగా కనిపిస్తుంది.   

PREV
17
జుట్టు రాలిపోతూనే ఉందా.. ఈ సూపర్ టిప్స్ ట్రై చెయ్యండి!

ఈ సమస్య తీవ్రత అధికంగా ఉన్నప్పుడు బట్టతల వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఈ సమస్యలను తగ్గించుకునేందుకు మందుల వాడకం బదులు తీసుకునే ఆహారంపట్ల శ్రద్ధ చూపించాలి. అప్పుడే జుట్టు ఆరోగ్యంతో (Hair health) పాటు శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది. మరి జుట్టు రాలడానికి కారణాలు.. తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

27

జుట్టు రాలి తిరిగి పోయిన జుట్టు వస్తే జుట్టు ఒత్తుగా, అందంగా ఉంటుంది. కానీ కొందరిలో ఊడిన జుట్టు శాతం ఎక్కువ, తిరిగి వచ్చే జుట్టు శాతం తక్కువగా ఉంటుంది. మరికొందరిలో అయితే రాలిపోయిన జుట్టు తిరిగిరాదు. ఇలా అధిక మొత్తంలో జుట్టు రాలడానికి రెండు ప్రధాన కారణాలు. అవి చుండ్రు (Dandruff), ప్రోటీన్ లోపం (Protein deficiency). ఈ రెండు సమస్యల కారణంగా జుట్టు ఆరోగ్యం దెబ్బతిని అధిక మొత్తంలో జుట్టు రాలుతుంది.
 

37

కనుక ఈ రెండు సమస్యలను తగ్గించుకుంటే జుట్టు రాలడం తగ్గి జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల (Infections) కారణంగా తలలో చుండ్రు పేరుకుపోతుంది. ఈ సమస్యను తగ్గించుకునేందుకు ప్రతిరోజు తలస్నానం (Head bath) చేయాలి. తలస్నానం చేసే సమయంలో చేతివేళ్లతో తలమాడుకు బాగా రుద్దుకొని తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు తొలగిపోతుంది.

47

అలాగే దురద (Itching), మంట వంటి ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి. తలస్నానానికి గాఢత ఎక్కువ గల షాంపులకు బదులుగా కుంకుడుకాయ, సికాయ వంటి వాటిని ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు లేకపోవడంతో ప్రోటీన్ లోపం ఏర్పడుతుంది. దీంతో జుట్టు రాలడం అధికమవుతుంది.  కనుక ప్రోటీన్ ఆహారాన్ని (Protein food) తీసుకోవాలి.

57

అప్పుడే జుట్టు కుదురులకు (Hair follicles) కావలసిన పోషకాలు అంది కుదుర్లు బలపడతాయి. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే జుట్టు వేగంగా ఒత్తుగా పెరుగుతుంది. ఇందుకోసం ప్రతిరోజు మొలకెత్తిన గింజలు (Sprouted seeds) తీసుకోవడం మంచిది. మొలకెత్తిన గింజలలో ప్రోటీన్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని అడ్డుకుంటాయి. అలాగే జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

67

గుమ్మడి గింజలు, అవిసె గింజలు, సన్ ఫ్లవర్ సీడ్స్ లలో జింక్, సెలినీయం, రాగి, మెగ్నీషియం, ఇనుము, కాల్షియం, విటమిన్లు వంటి పోషకాలు (Nutrients) పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పలుచబడడాన్ని అరికట్టి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీంతో జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే జుట్టు రాలడాన్ని  అరికట్టే మరో అద్భుతమైన గింజలు మెంతులు (Fenugreek).

77

మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి (Soaked) ఉదయాన్నే ఆ నీటిని తాగితే జుట్టు రాలే సమస్యలు తగ్గుతాయి. మెంతులలో ప్రోటీన్లు, నియాసిన్, అమినో యాసిడ్స్ (Amino acids), పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఓట్స్, వాల్ నట్స్, నువ్వులు, పల్లీలు, బాదం, గుడ్లు, ఆకుకూరలు, పండ్లు, పాల ఉత్పత్తులను తీసుకుంటే జుట్టుకు కావలసిన ప్రోటీన్లు పుష్కలంగా లభించి జుట్టు రాలడం తగ్గి జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా,  పొడవుగా పెరుగుతుంది

click me!

Recommended Stories