Parenting: నా తల్లిదండ్రులు ఇలా ఉంటే బాగుంటుంది అని ప్రతి బిడ్డ ఆశించే 3 విషయాలు ఇవే

Published : Jan 20, 2026, 11:03 AM IST

Parenting: తల్లిదండ్రులు, పిల్లల మధ్య అనుకోకుండా ఒక్కోసారి దూరం పెరుగుతుంది. తమ తల్లిదండ్రులు ఎలా ఉండాలో పిల్లలకు కూడా కోరికలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకొని తల్లిదండ్రులు అందుకు తగ్గట్టు ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. 

PREV
14
పేరెంటింగ్ టిప్స్

ప్రతి బిడ్డకు తల్లిదండ్రులు ఎంతో ముఖ్యమైన వారు. తల్లిదండ్రుల తమ పిల్లలను వారి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. అయినా కూడా ఒక్కోసారి తల్లిదండ్రులు, పిల్లల మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది. పిల్లల తమ భావాలను తల్లిదండ్రులకు వ్యక్తపరచలేరు. పిల్లలు తమ పేరెంట్స్ నుండి కొన్ని విషయాలను ఆశిస్తారు. కానీ అవి వారికి చెప్పలేరు. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులే ఆ విషయాలను అర్థం చేసుకొని తన పిల్లలకు తగ్గట్టు ప్రవర్తించాలి.

24
చెప్పేది వినండి

తల్లిదండ్రులు చెప్పినప్పుడు పిల్లలు జాగ్రత్తగా వింటారు. వినాలని పేరెంట్స్ ఆదేశిస్తారు కూడా. కానీ పిల్లలు మాట్లాడేటప్పుడు మాత్రం తల్లిదండ్రులు వినడానికి ఇష్టపడరు. ఏదో ఒక సలహా ఇవ్వడం, మధ్యలోనే సంభాషణ ఆపడం వంటివి చేస్తారు. కానీ పిల్లలు తమ తల్లిదండ్రులు తాము చెప్పేది పూర్తిగా వినాలని తమ భావాలను అర్థం చేసుకోవాలని ఆ తర్వాతే సలహాలు ఇవ్వాలని కోరుకుంటారు. కాబట్టి మీరు మీ పిల్లలు ఏం చెబుతారో ముందు పూర్తిగా వినండి. ఆ తర్వాతే సలహాలు సూచనలు ఇవ్వండి.

34
నమ్మకాన్ని కోరుకుంటారు

ప్రతి కూతురు, కొడుకు తమ తల్లిదండ్రుల నుంచి కోరేది తమపై నమ్మకం. వారిని నిరంతరం అనుమానించడం, అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం వంటివి చేస్తే పిల్లల ఆత్మ విశ్వాసం దెబ్బతింటుంది. వారు బలహీనంగా మారే అవకాశం ఉంటుంది. పిల్లలు తప్పులు చేసినా కూడా వారికి స్వేచ్ఛ ఇవ్వాలి. తద్వారా వారు ఆ తప్పుల నుండి నేర్చుకునే అవకాశం ఇవ్వాలి. అలా తప్పు చేసినప్పుడు ఎందుకు తప్పు జరిగిందో వివరించాలి. మీ పిల్లలను ముందుగా మీరు నమ్మాలి. అప్పుడే వారిలో బాధ్యత, ఆత్మ విశ్వాసం వంటివి పెరుగుతాయి.

44
ఇతరులతో పోల్చకండి

తల్లిదండ్రులు తరచుగా చేసే తప్పు ఇది. తమ పిల్లలను ఇతర పిల్లలతో పోలుస్తూ ఉంటారు. ఈ చిన్న విషయం మీ పిల్లలపై ఎంత ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందో మీకు తెలియదు. అలా చేయడం వల్ల మీ బాబు లేదా మీ పాప తీవ్రంగా కుంగిపోతారు. ఏ బిడ్డ అయినా తమ తల్లిదండ్రులు మంచినీ, చెడును రెండింటినీ అంగీకరించాలని కోరుకుంటాడు. ఇతరులతో పోల్చడం వల్ల పిల్లలు తమపై తాము చులకన భావాన్ని పెంచుకుంటారు. వారి సామర్థ్యాలు దీనివల్ల తగ్గిపోతాయి.

Read more Photos on
click me!

Recommended Stories