Alone People Psychology: ఎప్పుడూ ఒంటరిగా ఉండేవారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా?

Published : Jan 06, 2026, 02:12 PM IST

ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాళ్లను చూసి మనం వెంటనే ఓ నిర్ణయానికి వచ్చేస్తాం. “వీరిలో ఏదో సమస్య ఉంది. ఎవ్వరితో కలవరు” అని. కానీ నిజంగా ఒంటరిగా ఉండటం అంటే ఏంటి? అది బలహీనతనా? లేక సమాజాన్ని ద్వేషించడమా? వీరి గురించి సైకాలజీ నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?

PREV
17
Alone People Psychology

సాధారణంగా కొంతమంది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. అలాంటి వారిని చూసి మనం వెంటనే ఓ నిర్ణయానికి వచ్చేస్తాం. కానీ సైకాలజీ చెబుతున్న నిజం వేరు. ఒంటరిగా ఉండటం ఒక లక్షణం కాదు, ఎంపిక కావచ్చు. బలహీనత కాదు, రక్షణ కావచ్చు. ఎప్పుడూ ఒంటరిగా ఉండేవారి గురించి సైకాలజీ ఏం చెప్తోందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

27
ఒంటరితనం రెండు రకాలు

సైకాలజీ ప్రకారం ఒంటరితనం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎంచుకున్న ఒంటరితనం, రెండోది బాధ కలిగించే ఒంటరితనం. ఎంచుకున్న ఒంటరితనంలో ఉన్న వ్యక్తులు ఒంటరిగా ఉండటం వల్ల శక్తిని పొందుతారు. వీరు మంచిగా ఆలోచిస్తారు. చదువుతారు. వారితో వారు మాట్లాడుకుంటారు. ముఖ్యంగా ఇది ఇంట్రోవర్ట్ స్వభావం ఉన్నవారిలో కనిపిస్తుంది. వారికి జనాల మధ్య ఉండటం కంటే, ఒంటరిగా ఉండటమే మానసికంగా సేఫ్ గా అనిపిస్తుంది. 

37
కోరుకోని ఒంటరితనం

బాధ కలిగించే ఒంటరితనంలో ఉన్నవాళ్లు ఒంటరిగా ఉండాలని కోరుకోరు. కానీ పరిస్థితులు, అనుభవాలు, లేదా గత గాయాలు వారిని ఒంటరితనంలోకి నెట్టేస్తాయి. సైకాలజీ ప్రకారం బంధాల్లో నిర్లక్ష్యం, స్నేహాల్లో నమ్మకం దెబ్బతినడం, తిరస్కరణ అనుభవాలు, లేదా తరచూ అపార్థాలు ఎదుర్కోవడం వల్ల కొంతమంది మెల్లగా తమ చుట్టూ గోడ కట్టుకుంటారు. బయటికి శాంతంగా కనిపించినా, లోపల మాత్రం శూన్యం ఉండొచ్చు.

47
లోతైన ఆలోచన

ఎప్పుడూ ఒంటరిగా ఉండేవారు లోతుగా ఆలోచిస్తారు. వీరు మాటలకంటే ఆలోచనలను ఎక్కువ నమ్ముతారు. చిన్న విషయాలను కూడా గమనిస్తారు. అందుకే జనాల్లో ఉండటం వీరికి నచ్చదు. ఎక్కువ శబ్దం, ఎక్కువ సంభాషణలు, ఎక్కువ అంచనాల మధ్య ఉండటం కంటే ఒంటరిగా ఉండటమే మేలు అనుకుంటారు. 

57
స్వీయ రక్షణ

చాలామంది ఒంటరిగా ఉండేవాళ్లు, గతంలో ఎవరో ఒకరు తమ నమ్మకాన్ని దెబ్బతీశారని చెబుతారు. అందుకే వారు కొత్త సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి ఒక్కరినీ తమ దగ్గరికి రానివ్వరు. ఇది అహంకారం కాదు, స్వీయ రక్షణ. సైకాలజీ ప్రకారం దీన్ని ఎమోషనల్ బౌండరీ సెట్టింగ్ అంటారు.

67
సున్నితమైన భావాలు

ఒంటరిగా ఉండేవాళ్లు భావోద్వేగాలు లేని వాళ్లు అనుకోవడం తప్పు. నిజానికి, చాలాసార్లు వాళ్లు అత్యంత సున్నితమైన భావాలు కలిగి ఉంటారు. అందుకే చిన్న మాట కూడా వీరికి లోతుగా తాకుతుంది. కాబట్టి ప్రతి సంబంధాన్ని అంత డీప్ గా తీసుకోవడం కంటే ఒక్కరిద్దరితోనే నిజమైన అనుబంధం కలిగి ఉండటం మేలు అని వీరు అనుకుంటారు. 

77
అర్థం చేసుకోవడం ముఖ్యం

సైకాలజీ నిపుణుల సూచన ప్రకారం, ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాళ్లను మార్చాలని ప్రయత్నించడం కంటే, అర్థం చేసుకోవడం ముఖ్యం. వాళ్లను “ఎందుకు అలా ఉంటావు?” అని అడగడం కన్నా, “నీకు అలా ఉండటం కంఫర్ట్ గా ఉందా?” అని అడగడం మంచిది. అలాగే, ఒంటరిగా ఉండేవాళ్లు కూడా తమ ఒంటరితనం బాధగా మారుతోందా? లేక సంతోషంగానే ఉందా? అనేది తమను తాము ప్రశ్నించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories