ఆ రాష్ట్రంలో తయారైన వైన్ కు జీయో ట్యాగ్.. !! స్పెషాలిటీ ఏంటంటే...

First Published Sep 27, 2021, 2:02 PM IST

జుడిమా అనేది స్టిక్కీ రైస్‌తో తయారు చేసిన రై వైన్. దీనిని ఆవిరితో తయారు చేస్తారు. దీంట్లో సంప్రదాయ మూలికలను కలుపుతారు. అస్సాం రాష్ట్రంలోని దిమాసా తెగకు చెందిన వైన్ ప్రత్యేకమైనది. 

Judima rice wine

ఇటీవలే మణిపూర్‌లోని మోస్ట్ ఫేమస్ హథెయ్ మిరపకాయ, మెంగ్‌లాంగ్ ఆరెంజ్‌కు జియో ట్యాగ్ లభించింది. తాజాగా ఈ జాబితాలో అస్సాం జుడిమా రైస్ వైన్ కూడా చేరింది.

Judima rice wine

జియోగ్రాఫికల్ ట్యాగ్ ను  GI ట్యాగ్ అని కూడా పిలుస్తారు. జియోగ్రాఫికల్ ట్యాగ్ అనేది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యి, దానివల్ల ఆ ప్రాంతం.. ఆ పదార్థం ప్రాముఖ్యతను సంతరించుకున్న ఉత్పత్తులకు ఇస్తారు.

Judima rice wine

జుడిమా అనేది స్టిక్కీ రైస్‌తో తయారు చేసిన రై వైన్. దీనిని ఆవిరితో తయారు చేస్తారు. దీంట్లో సంప్రదాయ మూలికలను కలుపుతారు. అస్సాం రాష్ట్రంలోని దిమాసా తెగకు చెందిన వైన్ ప్రత్యేకమైనది. ప్రత్యేకమైన తీపి రుచిని కలిగి ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి ఒక వారం పడుతుంది. ఇది సంవత్సరాల తరబడి నిల్వ చేయబడుతుంది.

Judima rice wine

నివేదికల ప్రకారం, అస్పాంలోని హిల్ డిస్ట్రిక్స్ అయిన కర్బి ఆంగ్లాంగ్, డిమా హసావో నుండి GI ట్యాగ్ పొందిన రెండవ ఉత్పత్తి ఇది.

జుడిమా GI ట్యాగ్ పొందే విషయంలో జోర్హాట్ ఆధారిత అస్సాం అగ్రికల్చర్ యూనివర్శిటీ వ్యవసాయ పరిశోధన విభాగం శాస్త్రవేత్తలు డాక్టర్ కిశోర్ కుమార్ శర్మ, డాక్టర్ గార్గి శర్మ,  AAU డాక్టర్ ఎస్ మైబోంగ్సా, డాక్టర్ ఉత్తమ్ బైథారిని పొందే ప్రక్రియలో ఫెసిలిటేటర్లుగా వ్యవహరించారు. గౌహతి విశ్వవిద్యాలయం, జుడిమా దరఖాస్తు, డాక్యుమెంటేషన్‌లో పాల్గొంది.

Judima rice wine

GI ట్యాగ్ ఈ పానీయం దుర్వినియోగాన్ని అరికట్టగలదని అధికారులు భావిస్తున్నారు. ఇది స్థానిక సాంప్రదాయ పానీయం. అయితే, పౌరులు దీనిని బ్రాండ్ చేయాలని, భవిష్యత్తు కోసం దాని సంరక్షణను నిర్ధారించాలని కోరుకున్నారు.  అందుకే వారు ఒక గ్రూపుగా ఏర్పడి GI ట్యాగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
 

click me!