Clothing Sizes: రోజూ చూస్తాం కానీ అర్థం తెలియదు.. బట్టల సైజుల్లో ఉండే ఈ 'X' మీనింగ్ ఇదే

Published : Jul 20, 2026, 01:49 PM IST

Clothing Sizes: మాల్‍లో బట్టలు కొనేటప్పుడు XS, S, M, L, XL, XXL వంటి సైజ్ చూస్తాం. కానీ XL, XXL అంటే X అర్థం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. చాలా మందికి తెలియని ఈ ఆసక్తికరమైన విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
14
XS, S, M, L, XL, XXL

రోమన్ సంఖ్యల్లో X, XI, XII, XX, XL...ఇవి మనకు తెలిసిందే. షాపింగ్ మాల్‍లో బట్టలు కొనేటప్పుడు XS, S, M, L, XL, XXL వంటి సైజ్ చూస్తాం. కానీ XL, XXL అంటే X అర్థం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. చాలా మందికి తెలియని ఈ ఆసక్తికరమైన విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసినా, షాపులో బట్టలు కొన్నా ఈ సైజ్ మనకు కనిపిస్తాయి. S, M, L అంటే చాలామందికి తెలుసు. కానీ 'X' అక్షరం అర్థం మాత్రం చాలామందికి తెలియదు.

24
'X' అంటే ఏంటంటే..

రోమన్ సంఖ్యల్లో X-10, XI-11, XII-12, XX-20, XXX-30, XL-40…ఇలా మనకు తెలుసు. కానీ బట్టల మీద ఉన్న X అంటే ఏంటీ? నిజానికి, 'X' అంటే "Extra" అంటే అదనపు అని అర్థం. దాని ప్రకారం చూస్తే XS = Extra Small (చాలా చిన్నది) S = Small (చిన్నది) M = Medium (మధ్యస్థం) L = Large (పెద్దది) XL = Extra Large (ఇంకా పెద్దది) XXL = Extra Extra Large (మరింత పెద్దది) అంటే, 'X' అనేది సాధారణ సైజు కంటే ఒక మెట్టు ఎక్కువ లేదా తక్కువ సైజును సూచిస్తుంది. ఎన్ని 'X'లు ఉంటే, అంత పెద్ద లేదా చిన్న సైజు అని దాని అర్థం చేసుకోవాలి.

34
XL, XXL అన్ని బ్రాండ్లలో ఓకే సైజ్‍లో ఉంటాయా?
సాధారణంగా XL సైజు షర్టులు 42 నుంచి 44 అంగుళాల ఛాతీ కొలత ఉన్నవారికి సరిపోతాయి. XXL సైజును 44 నుంచి 46 అంగుళాల ఛాతీ కొలత ఉన్నవారి కోసం డిజైన్ చేస్తారు. కానీ ఈ కొలతలు ప్రతి బ్రాండ్‌ను బట్టి కొద్దిగా మారవచ్చు. అందుకే ఆన్‌లైన్‌లో లేదా షాపులో బట్టలు కొనే ముందు ఆ బ్రాండ్ 'Size Chart' చెక్ చేసుకోవడం చాలా మంచిది.
44
రోజువారీ జీవితంలో తెలుసుకోవాల్సిన విషయాలు
జనరల్ నాలెడ్జ్ అంటే కేవలం పుస్తకాల్లో లేదా పోటీ పరీక్షల్లో ఉండే విషయాలు మాత్రమే కాదు. మనం రోజూ వాడే వస్తువుల వెనుక కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగి ఉంటాయి. బట్టల సైజులో వాడే 'X' అక్షరం అర్థం కూడా అలాంటిదే. ఇకపై XL లేదా XXL అని చూసినప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన పనిలేదు. 'X' అంటే "Extra" అని గుర్తుంచుకోండి. అంటే XL = Extra Large, XXL = Extra Extra Large, XS = Extra Small అని దాని సింపుల్ మీనింగ్.
Read more Photos on
click me!

Recommended Stories