Falgu River: ఎండిపోయిన నది, తవ్వితే మాత్రం.. అమృతం లాంటి నీళ్లు.. సీతమ్మ శాపం పెట్టిన ఈ నది గురించి తెలుసా?

Published : Nov 02, 2026, 01:53 PM IST

Falgu River: మన దేశంలో ఉన్న ఓ నది సీతమ్మ పెట్టిన శాపం కారణంగా ఎండిపోయిందని మీకు తెలుసా? చూడటానికి మొత్తం ఎండిపోయినట్లే ఉన్నా.. తవ్వితే మాత్రం.. తియ్యటి నీరు బయటకు వస్తుంది..ఈ నది ఎక్కడ ఉందో తెలుసా?

PREV
13
విచిత్ర నది...

భారతదేశంలో పవిత్ర నదులు చాలా ఉన్నాయి. అలాంటి పవిత్ర నదుల్లో గయా కూడా ఒకటి. పితృదేవతల ఆత్మశాంతి కోసం, తమ పూర్వీకులకు ముక్తిని ప్రసాదించే పిండ ప్రదానం చేయడానికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే.. గయ అనగానే.. అక్కడి దగ్గరలో ప్రవహించే మరో పవిత్ర నది ఫల్గు నది అందరికీ గుర్తుకు వస్తుంది. అయితే.. నది దగ్గరకు ఎవరు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే... ఈ నదిలో ఎంత చూసినా చుక్క నీరు కూడా కనిపించదు. ఎడారిలా ఎండిపోయినట్లే కనిపిస్తుంది. కానీ... ఆ నదిని కనుక కొన్ని అంగుళాలు తవ్వితే చాలు... లోపలి నుంచి స్వచ్ఛమైన నీరు ఉబుకుతూ బయటకు వస్తుంది. ఎంత పెద్ద వర్షం పడినా.. పెద్ద ప్రళయం వచ్చినా కూడా నది మాత్రం పైకి కనపడదు. భూమి పొరల కింద మాత్రమే ప్రవహిస్తుంది. ఈ నది ఎందుకు ఇలా ప్రవహిస్తుంది? ఈ నదికీ రామాయణానికీ సంబంధం ఏంటి?

23
నదిపై సీతమ్మ శాపం..

రామాయణం ప్రకారం, వనవాస సమయంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు తమ తండ్రి అయిన దశరథ మహారాజుకి పిండ ప్రదానం చేయడానికి గయ క్షేత్రానికి చేరుకున్నారు. పూజ సామాగ్రిని తీసుకురావడానికి రాముడు, లక్ష్మణుడు అడవికి వెళ్లిన సమయంలో.. దశరథ మహారాజు ఆత్మ ప్రత్యక్షమై సమయం మించిపోతోందని, త్వరగా పిండ ప్రదానం చేయమని సీతాదేవిని కోరారట. భర్త రాక ఆలస్యం అవ్వడంతో, సమయం దాటిపోకూడదని సీతమ్మ ఫల్గు నది ఇసుకతోనే పిండ ప్రదాన క్రతువును పూర్తి చేసిందంట. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫల్గు నదిని ఈ పవిత్ర కార్యానికి ‘ప్రత్యక్ష సాక్షి’ గా ఉండమని వేడుకుందట.

అయితే.. శ్రీరాముడు తిరిగి వచ్చాక.. తాము లేని సమయంలో పిండ ప్రదానం జరిగిందంటే నమ్మలేకపయాడు. దాంతో, సీతాదేవి ఫల్గు నదిని సాక్ష్యం చెప్పమని కోరగా, ఆ నది అబద్ధం చెప్పిందట. దీంతో.. పవిత్ర కార్యానికి సాక్షిగా ఉండి కూడా అబద్ధం చెప్పినందుకు సీతా దేవి ఆగ్రహానికి గురై..శాపం పెట్టారట. ‘ ఒక పవిత్రమైన సత్యాన్ని దాచి అబద్దం చెప్పావు కాబట్టి, నువ్వు ఇకపై నదిగా నీ ఉనికిని కోల్పోతావు.. భక్తుల కంటికి కనిపించకుండా, నీ నీరు ఎప్పటికీ పైకి రాకుండా ఎండిపోయిన ఇసుకలా ఉండిపోతావు’ అని శాపం పెట్టిందట. నది తప్పు తెలుసుకొని క్షమాపణలు చెప్పడంతో.. శాపాన్ని కొద్దిగా సడలించి, నీరు పూర్తిగా ఎండిపోకుండా.. భూగర్భంలో ప్రవహిస్తుందని అభయం ఇచ్చారని స్థానికులు చెబుతూ ఉంటారు. నిజంగానే ఈ నదిపై ఎండిపోయినట్లు కనిపించి.. తవ్వితే మాత్రం... నీరు బయటకు వచ్చి కనపడుతుంది.

33
ఈ నది గురించి సైన్స్ ఏం చెబుతోంది..?

పురాణ కథలు మాత్రమే కాదు, ఈ నది ప్రవాహంపై సైన్స్ కూడా క్లారిటీ ఇచ్చింది. ఈ ఫల్గు నది పాత భూభాగంలో దట్టమైన ఇసుక, అవక్షేపాలు చాలా ఎక్కువ ఉన్నాయి. వర్షాకాలంలో వర్షపాతం వల్ల నీరు వచ్చినా, వర్షాలు తగ్గగానే నీరంతా ఇసుక పొరల్లోకి ఇంకిపోతోంది. అందుకే.. పైకి ఎండిపోయినట్లు కనిపించినా.. భూ గర్భంలో ఈ నది నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకే.. భక్తులు ఇక్కడికి వచ్చి.. ఆ ఇసుకను తవ్వి.. ఆ పవిత్ర నీటిని బయటకు తీసి పూజలు చేస్తూ ఉంటారు.

Read more Photos on
click me!

Recommended Stories