Fridge Cleaning: ఈ పదార్థంతో తుడిచారంటే పాత ఫ్రిజ్ కూడా కొత్తదానిలా మెరిసిపోతుంది

Published : Nov 02, 2026, 12:51 PM IST

Fridge Cleaning: ఫ్రిజ్‌లో పేరుకుపోయిన మొండి మరకలు, దుర్వాసన పోగొట్టడానికి ఖరీదైన వస్తువులు వాడుతున్నారా? అవసరం లేదు. కేవలం నీళ్లు ఒక్క పదార్థాన్ని వేసి తుడిచారంటే ఫ్రిజ్‌ను ఈజీగా క్లీన్ అయిపోతుంది.

PREV
13
ఫ్రిజ్ క్లీనింగ్ సింపుల్ టిప్స్

ఫ్రిజ్ గ్లాస్ ట్రేలపై ఉండే జిడ్డు, కూరగాయల మరకలు వదిలించడానికి ఖరీదైన కెమికల్స్ వాడాల్సిన పనిలేదు. అర కప్పు వైట్ వెనిగర్‌లో అంతే మోతాదులో సాధారణ నీటిని కలిపి స్ప్రే చేస్తే సరిపోతుంది. ఈ మిశ్రమం మొండి మరకలను సులభంగా వదిలించడంతో పాటు లోపల వచ్చే దుర్వాసనను కూడా తగ్గిస్తుంది.

క్లీనింగ్ మొదలుపెట్టే ముందు ఫ్రిజ్ పవర్ ఆఫ్ చేయడం చాలా ముఖ్యం. లోపల ఉన్న వస్తువులన్నీ ఒకేసారి బయట పెడితే త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, ముందుగా రెండు ట్రేలను మాత్రమే ఖాళీ చేసి క్లీన్ చేసుకోవడం మంచిది. పాలు, పెరుగు, మాంసం లాంటివి త్వరగా పాడవకుండా ఐస్ బాక్స్‌లో భద్రపరుచుకోవచ్చు. పాడైపోయిన లేదా ఎక్స్‌పైరీ డేట్ దాటిన వస్తువులు కనిపిస్తే వెంటనే చెత్తబుట్టలో పడేయండి.

23
గ్లాస్ ట్రేలను ఎలా క్లీన్ చేయాలి?

ఫ్రిజ్ నుంచి బయటకు తీసిన చల్లటి గ్లాస్ ట్రేలపై పొరపాటున కూడా వేడి నీళ్లు పోయకూడదు. ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా వచ్చే మార్పుల వల్ల అద్దాలు పగిలిపోయే ప్రమాదం ఉంది. అవి సాధారణ గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాతే క్లీన్ చేయడం మొదలుపెట్టాలి.

ముందుగా తయారు చేసుకున్న వెనిగర్ మిశ్రమాన్ని ట్రేలపై స్ప్రే చేసి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు వదిలేయాలి. అప్పుడు ఎండిపోయిన మరకలు నాని మెత్తబడతాయి. ఆ తర్వాత ఒక శుభ్రమైన మైక్రోఫైబర్ క్లాత్ తీసుకుని, ట్రే వెనుక నుంచి ముందుకు ఒకే దిశలో తుడవాలి.

ఇలా చేయడం వల్ల మురికి ఒక చోట నుంచి మరో చోటికి వ్యాపించదు. ఇంకా మరకలు పోకపోతే మృదువైన స్పాంజ్ వాడొచ్చు. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ స్క్రబ్బర్ లేదా గట్టి బ్రష్‌లతో రుద్దకూడదు.

33
వెనిగర్ ఎక్కడ వాడకూడదు?

ట్రేల అంచుల్లో ఉండే ప్లాస్టిక్ సందుల్లో పేరుకుపోయిన మురికిని పాత టూత్ బ్రష్‌తో నెమ్మదిగా రుద్ది శుభ్రం చేసుకోవచ్చు. అయితే, వెనిగర్‌లో ఉండే ఆమ్లత్వం (యాసిడ్) కారణంగా ఫ్రిజ్ డోర్ రబ్బర్ సీల్స్, అల్యూమినియం భాగాలపై దీన్ని అస్సలు వాడకూడదు. ఆ ప్రదేశాలను క్లీన్ చేయడానికి కొద్దిగా సబ్బు నీళ్లు వాడితే సరిపోతుంది.

పచ్చి మాంసం లేదా చికెన్ రసాలు పడితే, కేవలం వెనిగర్‌పైనే ఆధారపడకుండా సబ్బు నీటితో బాగా కడగాలి. అలాగే బ్లీచింగ్ పౌడర్ లాంటి క్రిమిసంహారకాలతో వెనిగర్‌ను ఎప్పుడూ కలపకూడదు. అలా చేస్తే ప్రమాదకరమైన వాయువులు వెలువడే అవకాశం ఉంది.

ట్రేలను తిరిగి ఫ్రిజ్‌లో పెట్టే ముందు, వాటిపై చుక్క నీరు కూడా లేకుండా చూసుకోవాలి. పొడి గుడ్డతో మూలలను బాగా తుడిచిన తర్వాతే ఫ్రిజ్‌లో అమర్చాలి. వండిన ఆహార పదార్థాలను మూతలున్న గిన్నెల్లో, కూరగాయలు, మాంసాన్ని వేర్వేరుగా నిల్వ చేసుకోవడం సురక్షితం.

Read more Photos on
click me!

Recommended Stories