Thailand Trip New Rules: థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సెప్టెంబర్ 15 నుంచి భారతీయులకు కొత్త రూల్స్

Published : Sep 14, 2026, 04:55 PM IST

Thailand Trip New Rules: థాయ్‌లాండ్‌కు వెళ్లే భారతీయులకు కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. వీసా లేకుండా 30 రోజుల వరకు ఉండొచ్చు. పాస్‌పోర్ట్, రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్‌తో పాటు 20,000 థాయ్ బాత్ నగదు, TDAC తప్పనిసరిగా సిద్ధంగా ఉంచుకోవాలి.

PREV
16
ఇండియన్స్ కోసం కొత్త రూల్స్

థాయ్‌లాండ్‌ వెళ్లాలని ప్లాన్ చేస్తున్న భారతీయ ప్రయాణికులు సెప్టెంబర్ 15, 2026 నుంచి కొత్త నిబంధనలును తప్పక తెలుసుకోవాలి. భారతీయ సాధారణ పాస్‌పోర్ట్‌ కలిగిన పర్యాటకులకు థాయ్‌లాండ్‌ వీసా ఫ్రీ ఎంట్రీ కొనసాగనుంది. అయితే ఈ సదుపాయం కింద దేశంలో ఉండే గరిష్ఠ వ్యవధిని 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించారు. ఈ మార్పుతో థాయ్‌లాండ్‌ ట్రిప్‌కు వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు, ప్రయాణ నిబంధనలను చెక్ చేసుకోవడం అవసరం.

26
వీసా అవసరం లేదు..

కానీ 30 రోజులు మాత్రమే సెప్టెంబర్ 15 నుంచి టూరిజం కోసం థాయ్‌లాండ్‌ వెళ్లే భారతీయ సాధారణ పాస్‌పోర్ట్‌ హోల్డర్లు ముందుగా టూరిస్ట్ వీసా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే వీసా మినహాయింపు సదుపాయం కింద గరిష్ఠంగా 30 రోజుల వరకు మాత్రమే ఉండేందుకు అనుమతి ఉంటుంది.

గతంలో భారతీయులకు 60 రోజుల వరకు వీసా ఫ్రీ ఎంట్రీ సదుపాయం ఉండేది. ఇప్పుడు ఆ వ్యవధిని 30 రోజులకు తగ్గించారు. అంటే భారతీయులకు థాయ్‌లాండ్‌ వీసా ఫ్రీ ఎంట్రీ పూర్తిగా రద్దు కాలేదు.. కేవలం స్టే వ్యవధిలో మార్పు వచ్చింది.

36
పాస్‌పోర్ట్‌ విషయంలో జాగ్రత్త

థాయ్‌లాండ్‌ వెళ్లే ప్రయాణికుల పాస్‌పోర్ట్‌.. దేశంలోకి ప్రవేశించే తేదీ నుంచి కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ కలిగి ఉండాలి. పాస్‌పోర్ట్‌ గడువు దగ్గర పడుతున్నట్లయితే ప్రయాణానికి ముందే రెన్యువల్ చేసుకోవడం మంచిది.

46
రిటర్న్ టికెట్ తప్పనిసరి

వీసా మినహాయింపు సదుపాయంతో థాయ్‌లాండ్‌ వెళ్లేవారు కన్ఫర్మ్‌డ్ రిటర్న్ లేదా తదుపరి ప్రయాణ టికెట్‌ను తమ దగ్గర ఉంచుకోవాలి. వన్‌వే టికెట్‌తో వెళ్లి తర్వాత రిటర్న్ ప్లాన్ చేసుకోవచ్చని భావించడం సరికాదు. ఇమ్మిగ్రేషన్ సమయంలో అవసరమైతే చూపించేందుకు రిటర్న్ టికెట్‌ వివరాలను అందుబాటులో ఉంచుకోవాలి.

హోటల్ బుకింగ్, ట్రావెల్ ప్లాన్ కూడా ఉండాలి

థాయ్‌లాండ్‌ ట్రిప్‌కు వెళ్లే ముందు హోటల్ లేదా అకామడేషన్ బుకింగ్‌ కన్ఫర్మ్ చేసుకోవడం అవసరం. అలాగే ఎక్కడెక్కడికి వెళ్లబోతున్నారు, ఎంతకాలం ఉంటారు వంటి ప్రాథమిక ట్రావెల్ ప్లాన్ లేదా ఇటినరరీని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. హోటల్ బుకింగ్ కన్ఫర్మేషన్‌ను ఫోన్‌లోనే కాకుండా అవసరమైతే చూపించేందుకు అందుబాటులో ఉంచుకోవడం మంచిది.

56
చేతిలో నగదు ఉండాల్సిందే

వీసా మినహాయింపు సదుపాయాన్ని ఉపయోగించుకునే పర్యాటకులు ఆర్థిక సామర్థ్యానికి సంబంధించిన నిబంధనను కూడా గుర్తుంచుకోవాలి. ఒక్కో ప్రయాణికుడి వద్ద కనీసం 20,000 థాయ్ బాత్ నగదు ఉండాలని సూచించారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.58 వేల వరకు ఉంటుంది.

అందువల్ల కేవలం క్రెడిట్ కార్డు లేదా డిజిటల్ పేమెంట్‌నే నమ్ముకుని వెళ్లకుండా.. అవసరమైన నగదును ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది.

థాయ్‌లాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ మర్చిపోవద్దు

థాయ్‌లాండ్‌లోకి ప్రవేశించే ముందు మరో ముఖ్యమైన ప్రక్రియను పూర్తి చేయాలి. అదే Thailand Digital Arrival Card (TDAC). విమానం, రోడ్డు లేదా సముద్ర మార్గం ద్వారా థాయ్‌లాండ్‌లోకి ప్రవేశించే ప్రయాణికులు ఈ డిజిటల్ అరైవల్ కార్డును పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రయాణికులు థాయ్‌లాండ్‌లోకి ప్రవేశించే సమయానికి ముందు 72 గంటల వ్యవధిలో TDAC సమర్పించుకోవచ్చు. ఫారమ్‌ పూర్తి చేసిన తర్వాత వచ్చే కన్ఫర్మేషన్‌ను కూడా భద్రంగా ఉంచుకోవడం మంచిది.

66
థాయ్‌లాండ్ కేవలం ట్రాన్సిట్ పాయింట్ అయితే?

థాయ్‌లాండ్‌ మీ ఫైనల్ డెస్టినేషన్ కాకుండా కేవలం ట్రాన్సిట్ పాయింట్‌ అయితే మరో విషయం గుర్తుంచుకోవాలి. మీరు వెళ్లాల్సిన తుది దేశానికి అవసరమైన వీసా, పాస్‌పోర్ట్‌, ఇతర ఎంట్రీ డాక్యుమెంట్లు మీ దగ్గర ఉండాలి. థాయ్‌లాండ్‌లో వీసా ఫ్రీ ఎంట్రీ ఉందనే కారణంతో తదుపరి దేశానికి సంబంధించిన వీసా నిబంధనలు వర్తించవని అనుకోవద్దు.

కాబట్టి సెప్టెంబర్ 15 తర్వాత థాయ్‌లాండ్‌ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్న భారతీయులు.. వీసా అవసరం లేదనే ఒక్క విషయంతో సరిపెట్టుకోకుండా పాస్‌పోర్ట్‌ వ్యాలిడిటీ, రిటర్న్ టికెట్‌, హోటల్ బుకింగ్‌, ట్రావెల్ ప్లాన్‌, అవసరమైన నగదు, TDAC వంటి అన్ని అంశాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories