హైదరాబాద్-వైజాగ్-అరకు టూర్ ప్యాకేజీ
చలికాలంలో కొన్ని ప్రదేశాలను సందర్శించే వచ్చే కిక్కే వేరు. ముఖ్యంగా ప్రకృతి అందాలకు నెలువైన అరకును సందర్శించడం జీవితంలో మరిచిపోలేని ఒక మధురానుభూతిని ఇస్తుంది. ఇలాంటి వారికోసమే తెలంగాణ టూరిజం ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. అరకుతో పాటు వైజాగ్‌లోని పలు ప్రాంతాలను కవర్ చేస్తూ.. ఒక టూర్‌ను ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్-వైజాగ్-అరకు పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ప్రతీ బుధవారం ఈ టూర్ అందులో ఉంటుంది. 4 రోజుల పాటు ఈ టూర్ సాగుతుంది.
Vizag
జర్నీ ఇలా సాగుతుంది..
మొదటి రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని పర్యాటక భవన్ నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. రెండోరోజు ఉదయం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. వెంటనే వైజాగ్‌లో హోటల్‌లోకి చెకిన్ కావాల్సి ఉంటుంది. అనంతరం రిఫ్రెష్ అయ్యాక టిఫిన్ చేసి. సింహాచలం, కైలాసగిరి, రుషికొండ, సబ్‌మైరైన్ మ్యూజియం వంటివి సందర్శిస్తారు. మధ్యలోనే భోజనం చేసుకొని సాయంత్రం వైజాబ్ బీచ్ సందర్శన ఉంటుంది. అనంతరం రాత్రి హోటల్‌కు చేరుకుంటారు. రెండో రోజు రాత్రి విశాఖపట్నంలోనే బస చేయాల్సి ఉంటుంది.
అరకు ప్రయాణం..
మూడో రోజు ఉదయం లేవగానే అరకు ప్రయాణం ఉంటుంది. వైజాగ్ నుంచి అరకుకు వెళ్లే ప్రయాణం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రకృతి రమణీయత నడుమ, ఘాట్ రోడ్డులో సాగే ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. ఇక అరకు చేరుకున్న తర్వాత అక్కడ ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి, కాఫీ ప్లానిటేషన్, బొర్ర గుహలు వంటి వాటిని సందర్శిస్తారు. రాత్రి అరకులోనే బస చేయాల్సి ఉంటుంది.
Araku
ఇక నాల్గవ రోజు ఉదయం లేవగానే అన్నవరం బయలుదేరి వెళ్తారు. అక్కడ స్వామివారి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత హైదరాబాద్ తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఐదో రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న వారికి నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది.
అన్నవరం టెంపుల్..
ప్యాకేజీ ధర విషయానికొస్తే పెద్దలకు రూ. 6,999కాగా చిన్నారులకు రూ. 5,599గా నిర్ణయించారు. నాన్ ఏసీ ప్రయాణం, వైజాగ్‌లో ఏసీతో కూడిన వసతి, అరకులో నాన్ ఏసీ హోటల్‌తో పాటు గైడ్ ఛార్జీలన్నీ టూర్ ప్యాకేజీలోనే కవర్ అవుతాయి. వీటికోసం ప్రయాణికులు ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక ఆహారం, ఎంట్రీ టికెట్స్, దర్శనం టికెట్లు, బోటింగ్ ఛార్జీలు వంటివి ఎవరికివారో సొంతంగా చెల్లించాల్సి ఉంటుంది.