Chicken Gravy Curry: ఫుల్ గ్రేవీ వచ్చేలా చికెన్ కర్రీ.. ఇలా చేసి తింటే.. దీని రుచి జన్మలో మర్చిపోలేరు..!

Published : Jun 08, 2026, 12:48 PM IST

Chicken Gravy Curry: ఎప్పుడూ చికెన్ కర్రీ ఒకేలా తిని బోర్ కొట్టిందా? అయితే, ఈసారి ఇలా ట్రై చేయండి. ఒక్కసారి ఈ మసాలాలతో చికెన్ కర్రీ చేసి తింటే మళ్లీ మళ్లీ ఇలానే తింటారు.రుచి అంత బాగుంటుంది.  

PREV
14
కమ్మనైన చికెన్ గ్రేవీ కర్రీ..

చాలా మందికి చికెన్ కర్రీ గ్రేవీలాగా చేయాలి అంటే..ఎక్కువగా నీళ్లు పోసి వండేయాలని అనుకుంటారు. కానీ.. నీళ్లు ఎక్కువ పోసి చేస్తే ఆ కూర లో రుచి ఉండదు. ఇలా మేము చెప్పే మసాలా పేస్టు వాడి కర్రీ చేస్తే మాత్రం చాలా కమ్మగా ఉంటుంది. ఈ రెసిపీ మొదలుపెట్టడానికి ముందు.. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఓసారి చూద్దాం..

24
చికెన్ కర్రీ..

ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. నిమ్మకాయ రసం వేసి కడగడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. శుభ్రంగా కడిగిన చికెన్ ని మనం ఇప్పుడు మారినేట్ చేసుకోవాలి. దానికి అర టీస్పూన్ పసుపు,ఒక టేబుల్ స్పూన్ కారం వేయాలి. నాన్ వెజ్ కి కొద్దిగా స్పైస్ ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుంది. తర్వాత అర టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ నూనె, రెండు స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి. పెరుగు వేయడం ఇష్టం లేకపోతే..నిమ్మరసం పిండుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకున్న చికెన్ ని కనీసం అరగంట పాటు ఫ్రిజ్ లో ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల.. చికెన్ చాలా తొందరగా ఉడుకుతుంది. చాలా మెత్తగా.. నోట్లే వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది.

34
మసాలా తయారీ...

చికెన్ ఫ్రిజ్ లో పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ పుచ్చగింజలు, ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు, ఒక టీ స్పూన్ గసగసాలు వేసి .. వాటిలో నీళ్లు పోసి కాసేపు నానపెట్టుకోవాలి.చికెన్ మారినేట్ అయ్యేలోగా ఇవి కూడా చాలా మంచిగా నానతాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని.. అందులో కొద్దిగా నూనె వేసి... అందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం చిన్న ముక్కలుగా కోసి వేయాలి. పది నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి. ఇందులోనే... రెండు టమాటాలు, ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కులుగా కోసి నూనెలో వేయాలి. వీటిని కాసేపు వేయించాలి. టామట ముఖ్క మెత్తగా మారే వరకు మగ్గించుకోవాలి. ఇది మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి వేయించుకోవాలి. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత.. ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా నాపెట్టుకున్న జీడిపప్పు, పుచ్చగింజలను మిక్సీజార్ లో వేసి.. వాటితో పాటు.. ఇప్పుడు వేయించుకున్న ఉల్లిపాయ, టమాట మిశ్రమాన్ని కూడా వేసి మెత్తటి పేస్టుులాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

44
చికెన్ కర్రీ తయారీ విధానం..

ఇప్పుడు ప్యాన్ తీసుకొని నాలుగు నుంచి ఐదు స్పూన్ల నూనె వేయాలి. నూనె కాగిన తర్వాత జీలకర్ర, మూడు నాలుగు యాలకులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసి కొద్దిగా వేయించాలి. ఇప్పుడు నాలుగు పచ్చి మిరపకాయలు , కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత... ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి కూడా వేయించాలి. నీళ్లు వేయకుండా.. చికెన్ లో నుంచి నీళ్లు బయటకు వచ్చేలా.. మూత పెట్టి.. మీడియం మంట మీద ఉడికించాలి. ముక్క చేతితో పట్టుకుంటే ఉడికింది అని అనిపించినప్పుడు... ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని కూడా వేయాలి. ఈ పేస్టును మనం చికెన్ తో కలిపి వేయించాలి. ఆ పేస్టు చికెన్ తో పాటు ఉడికితే రుచి పెరుగుతుంది. మనం.. మూత పెట్టుకుంటూ.. మధ్య మధ్యలో కలుపుకుంటూ పది నిమిషాలు ఉడికించాలి.గ్రేవీలో నుంచి నూనె పైకి వచ్చినట్లు కనిపిస్తే.. కూర రెడీ అయినట్లే. ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా లేదా చికెన్ మసాలా వేసుకోని.. బాగా కలపాలి. ఇప్పుడు అర కప్పు నీళ్లు పోసి కలపాలి. ఈ సమయంలో.. ఉప్పు, కారం చెక్ చేసుకోండి.. తక్కువ అయితే.. ఈ సమయంలో కలుపుకోవచ్చు. ఐదు నిమిషాల ఉడకనిస్తే.. కమ్మని, టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్లే.. ఇలా ఒక్కసారి చేసుకుంటే.. మళ్లీ మళ్లీ ఇదే రెసిపీ చేసుకోవాలని అనుకుంటారు. అంత రుచిగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇది ప్లెయిన్ వైట్ రైస్ , చపాతీ, బగారా అన్నం అన్నింటికీ చాలా బాగుంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories