Face Glow: అయ్యో అప్పుడే ముఖంపై ముడతలా? వీటితో ఆ ముడతలను ఈజీగా చెరిపేయచ్చు..!

Published : Jun 08, 2026, 11:39 AM IST

 Face Glow: వయసు పెరుగుతుంటే ముఖంపై ముడతలు రావడం చాలా సహజం. అయితే, ఈ రోజుల్లో కనీసం 30 కూడా దాటక ముందే ముఖంలో కళ తగ్గిపోతోంది. అయితే, ఆ ముడతలను మనం చాలా ఈజీగా తగ్గించొచ్చు. మీ వయసు ఐదేళ్లు తగ్గించే చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది. 

PREV
13
ముఖంపై ముడతలు తగ్గించే టెక్నిక్..

ఈ రోజుల్లో సరైన తిండి, మంచి నిద్ర కరవు అయ్యాయనే చెప్పాలి. దీనికి తోడు ఇంట్లో పనులు, ఆఫీసు ఒత్తిడి కారణంగా 30 నిండక ముందే ముఖంపై ఫైన్ లైన్స్.. తలలో తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. వీటికి చెక్ పెట్టడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు తెచ్చి ముఖానికి పూసేస్తూ ఉంటారు. కానీ.. వాటి ఖరీదు చాలా ఎక్కువ. అందరికీ వాటిని కొనడం సాధ్యం కాకపోవచ్చు. అంతేకాదు.. వాటిని రెగ్యులర్ గా కూడా వాడలేం. అందుకే.. సహజంగా మనకు ఇంట్లో లభించే వస్తువులతోనే యవ్వనంగా మెరిసిపోవచ్చు. ముఖ్యంగా ముఖంపై వస్తున్న ఫైన్ లైన్స్ తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

23
ఇంట్లోనే ఫేస్ ప్యాక్...

ముఖం మీద ముడతలను మాయం చేయడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక కోడిగుడ్డు, ఒక టీ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ కలబంద జెల్ లేదా పెరుగు, 3 చుక్కల బాదం నూనె ఉంటే సరిపోతాయి.

వీటిని ముఖానికి ఎలా వాడాలంటే...

ముందుగా ఒక శుభ్రమైన గిన్నెలో గుడ్డును పగలకొట్టి.. అందులో నుంచి పచ్చ సొనను వేరుగా తీసుకోవాలి. మన ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి గుడ్డు పచ్చ సొన ఉంటే చాలు.. ఇప్పుడు ఆ పచ్చ సొనలో తేనె కలపాలి. ఇదే మిశ్రమంలో కలబంద జెల్, బాదం నూనె కూడా వేసి బాగా కలపాలి. ఒక క్రీమ్ లాగా మారేంత వరకు కలపాలి.

తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత.. తడి లేకుండా తుడుచుకొని.. ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని పూతలాగా ముఖం, మెడ మొత్తం రాయాలి. 15 నిమిషాలపాటు అలానే వదిలేసి.. పూర్తిగా ఆరిన తర్వాత... ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.ఆ తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

33
ముడతలు పోవడానికి ఎంత సమయం పడుతుంది?

ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల నెమ్మదిగా ముఖంపై ముడతలు తగ్గుముఖం పడతాయి. బాదం నూనె వేయడం వల్ల గుడ్డు వాసన రాకుండా ఉంటుంది. అయితే.. ప్యాచ్ టెస్టు చేసుకొని ఎలాంటి అలెర్జీలు రాలేదు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే... ముఖానికి రాయాలి. మీకు ఏదైనా అలెర్జీ సమస్య ఉంటే.. దీనిని వాడకూడదు. మీ స్కిన్ కి కలబంద సెట్ అవ్వదు అనుకుంటే దాని స్థానంలో పెరుగు కూడా వాడొచ్చు. కానీ.. ఈ రెమిడీ మాత్రం చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. మీ స్కిన్ ని టైట్ చేస్తుంది. స్మూత్ గా మారుస్తుంది. రెండు నెలలు వరసగా దీనిని వాడితే... మీ వయసు ఐదేళ్లు తగ్గిపోవడం ఖాయం

Read more Photos on
click me!

Recommended Stories