Modi Gift: స్విస్ ప్రెసిడెంట్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్ ఇదే.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Published : Oct 06, 2026, 09:43 AM IST

Modi Gift: భారత్ పర్యటనకు వచ్చిన స్విట్జర్లాండ్ అధ్యక్షుడికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకమైన కానుక ఇచ్చారు. ప్రస్తుతం దీని గురించే సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇంతకీ మోదీ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

PREV
16
స్విట్జర్లాండ్ అధ్యక్షుడికి మోదీ గిఫ్ట్

భారత్ పర్యటనకు వచ్చిన స్విట్జర్లాండ్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ప్రత్యేకమైన కానుక ఇచ్చారు. సాధారణంగా స్విట్జర్లాండ్ అంటే చీజ్‌కు పెట్టింది పేరు. అలాంటి దేశాధ్యక్షుడికి మన దేశంలో తయారైన మూడు ప్రత్యేకమైన చీజ్‌లను మోదీ బహుమతిగా అందించారు. ఈ మూడు చీజ్‌లు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు కూడా గెలుచుకున్నాయి.

26
భారత్ పర్యటనకు వచ్చిన గై పార్మెలిన్

స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్ మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చారు. అక్టోబర్ 5న న్యూఢిల్లీలో ప్రధాని మోదీ ఆయనతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రవాణా టెక్నాలజీ, మొబిలిటీ వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు సహా పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కూడా జరిగాయి.

చర్చల తర్వాత మోదీ, పార్మెలిన్‌కు హైదరాబాద్ హౌస్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ భోజనంలో భారతీయ, స్విస్ రుచులను కలిపిన ప్రత్యేక వంటకాలను వడ్డించారు. ఇదే సందర్భంగా స్విస్ అధ్యక్షుడికి మూడు అవార్డులు గెలుచుకున్న భారతీయ చీజ్‌లను మోదీ బహుమతిగా ఇచ్చారు.

36
గుల్మార్గ్.. ఫ్రెంచ్ స్టైల్ బ్రి చీజ్

మొదటి చీజ్ పేరు గుల్మార్గ్. ఇది ఫ్రెంచ్ బ్రి చీజ్ తరహాలో తయారవుతుంది. పాశ్చరైజ్డ్ ఆవు పాలతో తయారు చేసే ఈ చీజ్ మెత్తగా, క్రీమీగా ఉంటుంది. పైభాగంలో తెల్లటి పొర, లోపల మట్టి, పుట్టగొడుగుల తరహా స్వల్ప సువాసన ఉంటుంది. 2026లో బ్రెజిల్‌లో జరిగిన Mundial do Queijo do Brasil పోటీలో గుల్మార్గ్ చీజ్‌కు సూపర్ గోల్డ్ అవార్డు లభించింది.

46
కోణార్క్.. ప్రత్యేకమైన టామ్ స్టైల్ చీజ్

రెండో చీజ్ పేరు కోణార్క్. ఇది ఫ్రెంచ్ టామ్ చీజ్ శైలిని ఆధారంగా చేసుకుని తయారు చేసిన చీజ్. సహజమైన పొరతో, కొంత గట్టిగా ఉండే ఈ చీజ్‌లో మట్టి, సావరీ రుచులతో పాటు చివర్లో స్వల్ప నిమ్మరసం తరహా ఫ్లేవర్ ఉంటుంది. కోణార్క్ చీజ్‌కు 2023లో నార్వేలో జరిగిన World Cheese Awardsలో గోల్డ్ అవార్డు వచ్చింది. 2025లో స్విట్జర్లాండ్‌లో జరిగిన పోటీలో సిల్వర్ అవార్డును కూడా గెలుచుకుంది.

56
యీవూర్.. స్విస్ గ్రుయేర్ స్ఫూర్తితో

మూడో చీజ్ యీవూర్. ఇది స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రసిద్ధ గ్రుయేర్ చీజ్ స్ఫూర్తితో తయారు చేసిన మౌంటెన్-స్టైల్ చీజ్. సుమారు 8 నుంచి 9 నెలల పాటు దీనిని నిల్వ చేస్తారు. దీంతో ఇందులో నట్స్, స్వల్ప తీపి, హెర్బల్ రుచులు మిక్స్ అవుతాయి. క్రిస్ మస్ టైంలో 45 రోజుల కేక్ మిశ్రమం కలుపుతారే అలా. దీని పై పొరపై గులాబీ రేకులు, సోంపు గింజలతో అలంకరిస్తారు. భారతీయ, ఆల్పైన్ చీజ్ కలయికగా దీనిని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ చీజ్ బాగా కరుగుతుంది. అందుకే ఫాండ్యూ, గ్రిల్డ్ వంటకాల్లో కూడా దీనిని ఉపయోగిస్తారు.

66
సోషల్ మీడియాలో దీని గురించే చర్చ

స్విట్జర్లాండ్ చీజ్‌లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నప్పటికీ.. భారత్‌లోనూ అంతర్జాతీయ స్థాయి చీజ్‌లు తయారవుతున్నాయనే విషయాన్ని మోదీ ఇచ్చిన ఈ ప్రత్యేక కానుక మరోసారి చాటిచెప్పింది.

Read more Photos on
click me!

Recommended Stories