Coconut Oil: సాధారణంగా చాలామంది కొబ్బరి నూనెను బయట కొనుగోలు చేస్తుంటారు. దీని తయారీ చాలా కష్టం అనుకుంటారు. కానీ ఇంట్లోనే చాలా సింపుల్ గా, ఈజీగా స్వచ్ఛమైన కొబ్బరినూనెను తయారుచేసుకోవచ్చు. మరి లేటెందుకు ఆ ప్రాసెస్ గురించి తెలుసుకుందామా…
ప్రస్తుతం ఎక్కడ చూసినా చాలా పదార్థాలను కల్తీ చేస్తున్నారు. ముఖ్యంగా వంట నూనె, కొబ్బరి నూనె వంటివాటిలో కల్తీ ఎక్కువగా జరుగుతోంది. మరి అలాంటి వాటి నుంచి తప్పించుకోవాలంటే కొబ్బరినూనెను ఇంట్లో తయారు చేసుకోవడం మంచిది. దానికోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. చాలా సింపుల్ గా ఇంట్లో ఉండే కొబ్బరితో స్వచ్ఛమైన నూనెను తయారు చేసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
25
కొబ్బరి పాలు తీయడం
బాగా ఎండిన కొబ్బరికాయలను పగలగొట్టి, లోపల ఉండే కొబ్బరిని ముక్కలుగా కోసుకోవాలి. ఆ ముక్కలను శుభ్రం చేసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
రుబ్బిన కొబ్బరిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా పిండితే చిక్కటి కొబ్బరి పాలు వస్తాయి. వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఆ తర్వాత మళ్లీ తగినన్ని నీళ్లు పోసి రుబ్బి, రెండోసారి కూడా పాలు తీసి పక్కన పెట్టుకోవాలి.
35
పాలను పులియబెట్టడం
తీసిన కొబ్బరి పాలను ఒక పల్చటి వస్త్రం లేదా జల్లెడతో వడకట్టుకోవాలి. ఇలా వడకట్టిన పాలను మూత ఉన్న గిన్నెలో పోసుకోవాలి.
ఆ గిన్నెను సుమారు 8 గంటల పాటు గది ఉష్ణోగ్రత వద్దే ఉంచాలి. అప్పుడు పాలు సహజంగానే పులుస్తాయి.
8 గంటల తర్వాత ఆ గిన్నెను తీసుకెళ్లి ఒక 2 గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల కొబ్బరి పాలలో ఉండే కొవ్వు అంతా పైకి తేలుతుంది.