మిగతా పూలన్నింటికంటే తామర పూలు కొంచెం ప్రత్యేకం. ఎందుకంటే ఇవి నీటిలోనే పెరుగుతాయి. ఇంట్లో వీటిని పెంచడం కష్టమని చాలామంది అనుకుంటారు. కానీ చెరువుల్లోనే కాదు, మీ ఇంట్లో కూడా వీటిని సులభంగా పెంచుకోవచ్చు. ఈ టిప్స్ పాటిస్తే చిన్న కుండీలోనే గుత్తులు గుత్తులుగా తామర పూలు పూస్తాయి.
సరైన సమయానికి నీరు, ఎరువు
ఈ మొక్కలను పెంచాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన మట్టిని ఎంచుకోవాలి, తగినంత సూర్యరశ్మి ఉండేలా చూసుకోవాలి, ఎప్పుడూ నీరు ఉండేలా జాగ్రత్త పడాలి. ఇంట్లో ఈ పూలను పెంచాలనుకుంటే, మొక్కను నాటిన తర్వాత సమయానికి నీరు, ఎరువులు వేస్తూ ఉండాలి.