రాత్రి పూట ఈ పండ్లను అస్సలు తినకండి.. తిన్నారో మీ పని అంతే..!

First Published Oct 21, 2022, 4:00 PM IST

నిజానికి పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తింటే మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. కానీ రాత్రిపూట కొన్ని పండ్లను తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 
 

Fruits

పండ్లు ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి చాలా మంచివి. పండ్లలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి ఎన్నో రకాల పోషకాల లోపాన్ని పోగొడుతాయి. అందుకే రోజుకు రెండు, మూడు రకాల పండ్లను తప్పనిసరిగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.అంతా బానే ఉన్నా.. కొన్ని రకాల పండ్లను రాత్రిపూట తినడం మంచిది కాకదు. ఒకవేళ తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంతకీ ఎలాంటి పండ్లను రాత్రిపూట తినకూడదో తెలుసుకుందాం పదండి.. 

ఆపిల్

రోజూ ఒక ఆపిల్ పండును ఖచ్చితంగా తినాలని డాక్టర్లు చెప్తుంటారు. ఎందుకంటే ఈ పండు ఎన్నో రోగాల ప్రమాదాల్ని పోగొడుతుంది. అయినప్పటికీ.. ఆపిల్ పండ్లను రాత్రిపూట తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే ఈ పండ్లను తినడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఎందుకంటే వీటివల్ల జీర్ణక్రియ సరిగ్గా పనిచేయదు. దీనివల్ల ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. 
 

banana

అరటిపండు

అరటిపండులో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. దీన్ని తినడం వల్ల ఎముకలు బలంగా అవుతాయి. బరువు కూడా తగ్గుతారు. తక్షణ శక్తి కూడా అందుతుంది. కానీ వీటిని రాత్రిపూట తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది సాయంత్రం పూట వ్యాయామం చేసి అరటిపండును తింటుంటారు. లేదా ఫ్రూట్ సలాడ్, జ్యూస్ గా చేసుకుని కూడా తీసుకుంటుంటారు. కానీ రాత్రిపూట అరటిపండును అస్సలు తినకూడదు. 
 

సపోటాలు

సపోటాల్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని రాత్రిపూట తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. శరీర శక్తి స్థాయిలు కూడా పెరుగుతాయి. దీంతో రాత్రిపూట అస్సలు నిద్రరాదు. అందుకే సపోటాలను రాత్రిళ్లు అస్సలు తినకండి. 

బత్తాయి

బత్తాయిలను కూడా రాత్రిపూట తినకూడదు. ఎందుకంటే వీటిలో ఉండే ఆమ్ల పదార్థాలు గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయి. దీనివల్ల రాత్రిళ్లు అస్సలు నిద్ర రాదు. 
 

ద్రాక్ష, నారింజ పండ్లు

 సిట్రస్ పండ్లు అయిన నిమ్మ, నారింజ, ద్రాక్షల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. కానీ వీటిని రాత్రిపూట తినకూడదు. తింటే ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వస్తాయి.           
 

click me!