వేసవిలో నిద్రకు చిట్కాలు
మంచి నిద్ర ఆరోగ్యం కోసం చాలా ముఖ్యం. హాయిగా నిద్రలేకపోతే చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ ఇప్పుడు వేసవి కాలం మొదలైంది, ఎండలు మధ్యాహ్నం మాత్రమే కాదు రాత్రి కూడా ఉంటున్నాయి. దీనివల్ల రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు కొందరు. అందరి ఇళ్లల్లో ఏసీ ఉండదు కాబట్టి, వాళ్లు రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోలేక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పగటిపూట పనిచేసేవాళ్లు రాత్రిళ్లు హాయిగా నిద్రపోవాలని అనుకుంటారు. వేసవి వేడి కారణంగా చాలామంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. దీనివల్ల శరీరం మాత్రమే కాదు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మీరు కూడా వేసవిలో రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోలేకపోతే, హాయిగా నిద్రపోవడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
పడుకునే గదిని చల్లగా ఉంచుకోండి
మీరు రాత్రి పడుకునే గదిలో వేడి ఉండకుండా చూడటానికి, పడుకునే కొన్ని గంటల ముందు ఫ్యాన్ లేదా ఏసీ ఆన్ చేయండి. దీనివల్ల బెడ్‌రూమ్ చల్లగా ఉంటుంది. ఇంకో మార్గం ఏంటంటే, ఫ్రిజ్‌లో చాలా గంటలు ఉంచిన నీళ్లను ఒక గిన్నెలో వేసి దాన్ని ఫ్యాన్‌కు ఎదురుగా లేదా కిటికీ ఉన్న చోట పెడితే పడుకునే గది చల్లగా ఉంటుంది.
మంచి పరుపు
వేసవి వేడిలో కూడా రాత్రి హాయిగా నిద్రపోవాలంటే, మీరు పడుకునే పరుపు మంచిగా ఉండాలి. అంటే లైట్‌గా, వేడిని తగ్గించే మంచి నాణ్యమైన పరుపును వాడాలి.
పడుకునే ముందు స్నానం!
పగటిపూట మీరు కష్టపడి పనిచేయడం వల్ల, అది కూడా వేడి తాకిడికి శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ శరీరం నుంచి వేడిని తగ్గించడానికి రాత్రి పడుకునే ముందు చల్లటి నీటితో స్నానం చేస్తే, హాయిగా నిద్ర వస్తుంది.
రాత్రి భోజనం ముఖ్యం:
రాత్రిపూట కడుపు నిండా ఎప్పుడూ తినకూడదు. అలాగే కారంగా ఉండే ఆహారాలు తినడం కూడా మానుకోండి. లేదంటే మీ నిద్రకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు తేలికపాటి ఆహారాలు మాత్రమే తినండి. అప్పుడే మీరు రాత్రి హాయిగా నిద్రపోగలరు.
శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచండి!
వేసవి కాలం వేడిని తట్టుకోవడానికి మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోండి. అలాగే రాత్రి పడుకునే ముందు ఎక్కువగా నీళ్లు లేదా మరేదైనా పానీయం తాగకండి. లేదంటే మీ నిద్ర చెడిపోతుంది. ఇంకా రాత్రిపూట మూత్రం వస్తుంది.
మొబైల్, టీవీ చూడటం తగ్గించుకోండి:
రాత్రి పడుకునే ముందు ఒక గంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ చూడటం మానుకోవడం మంచిది. లేదంటే నిద్ర చెడిపోతుంది. కాబట్టి పడుకునే ముందు డిజిటల్ స్క్రీన్ వాడటం తగ్గించుకోండి.
ఒకే సమయంలో పడుకోండి:
ప్రతిరోజు ఒకే సమయంలో పడుకుని లేవడాన్ని అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ నిద్రకు ఆటంకం కలగదు, ఆరోగ్యం కూడా బాగుంటుంది.