Lifestyle: వాకింగ్ విషయంలో ఈ తప్పులు చేయకండి.. '666' రూల్‌ ఫాలో అయితే బోలెడన్ని లాభాలు

Published : Mar 16, 2025, 09:54 AM IST

Walking: ప్రస్తుతం జీవన విధానంలో పూర్తిగా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు మానసిక ఒత్తిడి తక్కువగా ఉండేది, శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం శారీరక శ్రమ తగ్గింది, మానసిక శ్రమ పెరిగింది. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. అయితే ఎన్నో సమస్యలకు వాకింగ్ పరిష్కారమని నిపుణులు చెబుతుంటారు. కానీ వాకింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
14
Lifestyle: వాకింగ్ విషయంలో ఈ తప్పులు చేయకండి.. '666' రూల్‌ ఫాలో అయితే బోలెడన్ని లాభాలు

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ కచ్చితంగా అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. రెగ్యులర్‌గా వాకింగ్‌ చేయడం వల్ల గుండెపోటు, రక్తపోటు, ఊబకాయంతో పాటు మానసిక సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు సూచిస్తుంటారు. అయితే మనలో చాలా మంది వాకింగ్‌ విషయంలో తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. ఒకేసారి ఎక్కువగా నడవడం లేదా తక్కువగా నడవడం వంటివి చేస్తుంటారు. అయితే వాకింగ్‌ విషయంలో 6-6-6 రూల్‌ను ఫాలో కావాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఏంటీ రూల్‌.? దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

24
walking benefits

ఇంతకీ ఏంటీ 666 రూల్‌.? ఇందులో ఏం చేస్తారు.? (666 Walking rule)

వాకింగ్‌కు సంబంధించి నిపుణులు ఒక వినూత్నమైన నియమాన్ని ప్రతిపాదించారు. ఈ నియమం ప్రకారం వారంలో ఏడు రోజులు కాకుండా 6 రోజులు వాకింగ్ చేస్తారు. అంటే ఒకరోజు వాకింగ్ నుంచి బ్రేక్‌ తీసుకోవచ్చన్నమాట. అయితే ఎప్పుడుపడితే అప్పుడు కాకుండా ఉదయం 6 గంటలకు వాకింగ్‌ చేయాలి. ఆ సమయంలో వాకింగ్ చేయడం వల్ల లేలేత సూర్య కిరణాలు శరీరంపై పడడం ద్వారా విటమిన్‌ డీ కూడా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

34
walking benefits

ఇక క్రమంగా నడిచే దూరాన్ని 6 కిలోమీటర్ల వరకు పెంచుకుంటూ పోవాలని సూచిస్తున్నారు. అయితే నేరుగా వార్మప్‌ చేయకుండా ముందుగా కచ్చితంగా 6 నిమిషాలు వార్మప్‌ చేయాలని సూచిస్తున్నారు. ఇలా వాకింగ్ చేసే సమయంలో ఈ 666 విధానాన్ని ఫాలో కావాలని చెబుతున్నారు. రోజూ గంట పాటు వాకింగ్‌ చేయడాన్ని అలవాటుగా మార్చుకుంటే ఆరోగ్యంపై సానుకూల ప్రభావం పడుతుంది. 
 

44
walking

దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి.? 

ఈ 666 రూల్‌లో ఉదయం 6 గంటలకు వాకింగ్ మొదలు పెడతాం కాబట్టి లేలేత కిరణాలు శరీరంపై పడతాయి. దీనివల్ల విటమిన్‌ డీ లోపాన్ని జయించవచ్చు. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఉదయం పూట ప్రశాంతమైన వాతావరణంలో వాకింగ్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఒత్తిడితో బాధపడేవారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. 

ఉదయం వాకింగ్ చేయడం వల్ల మెదడులో ఎండార్ఫిన్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ హార్మోన్ విడుదల కారణంగా ఒత్తిడి తగ్గించడంలో కూడా సాయపడుతుంది. దీంతో మీరు రోజంతా చురుగ్గా ఉంటారు. ఇక కడుపుబ్బరం, గ్యాస్‌, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా వాకింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఉదయం మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారికి బాగా ఉపయోగపడుతుంది. 

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

click me!

Recommended Stories