Coffee: మీరు తాగే కాఫీలో బొద్దింక అవశేషాలు ఉన్నాయేమో చూసుకోండి

Published : Oct 09, 2025, 06:11 PM IST

మనకే కాదు ప్రపంచ దేశాల ప్రజలకు ఎంతోమందికి కాఫీ అంటే చాలా ఇష్టం. టీ, కాఫీలు తాగిన తరువాతే రోజును మొదలుపెట్టే వారు ఎంతోమంది. అయితే కాఫీ గురించి కొన్ని భయంకరమైన నిజాలు ఉన్నాయి. ముఖ్యంగా కాఫీని ఇష్టపడేవారు కచ్చితంగా తెలుసుకోవాలి. 

PREV
15
కాఫీతో రోజు మొదలు

ప్రతిరోజు కాఫీతోనే దినచర్యను ప్రారంభించే వారి సంఖ్య చాలా ఎక్కువ. రోజును ఉత్సాహంగా ఉల్లాసంగా మొదలు పెట్టాలంటే పొట్టలో కప్పు కాఫీ పడాల్సిందే. అయితే కాఫీ పొడిలో బోద్దింకల పొడి కూడా ఉండే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది వినడానికి కాస్త అసహ్యకరంగా ఉండవచ్చు.. కానీ ఆధారం లేకుండా చెప్పిన విషయం మాత్రం కాదు. కాఫీ పొడిలో బొద్దింకల అవశేషాలు ఉండే అవకాశం చాలా ఎక్కువ.

25
బొద్దింకలకూ ఇష్టమే

కాఫీ వాసన అంటే మనకే కాదు.. బొద్దింకలకు కూడా చాలా ఇష్టం. కాఫీ గింజలు ఎక్కడ ఉంటే అక్కడకి పాక్కుంటూ వెళ్లిపోతాయి. కాఫీ గింజలను పెద్ద గిడ్డంగులలో టన్నుల కొద్దీ భద్రపరుస్తారు. అలాంటప్పుడు కచ్చితంగా బొద్దింకలు కాఫీ గింజల్లో తిరుగుతూ ఉంటాయి. కాఫీ పరిశ్రమలో పనిచేసే ఎవరికైనా ఈ విషయం తెలుస్తుంది.

35
బొద్దింకల అవశేషాలు తప్పవు

ఇక కాఫీ పరిశ్రమలో పనిచేసే వారు కాఫీ గింజల నుండి బొద్దింకలను పూర్తిగా తొలగించలేరు. ఎక్కడో చోట కొన్ని బొద్దింకలు మిగిలిపోతాయి. ప్రాసెసింగ్ సమయంలో కూడా అవి కాఫీ గింజల్లో కలిసి పోతాయి. యుఎస్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ చెప్పిన ప్రకారం కాఫీలో కొంత మొత్తంలో బొద్దింకల అవశేషాలు ఉండే అవకాశం ఉందని ఆమోదించింది.

45
కంపెనీలే ఒప్పుకున్నాయి

పెద్ద మొత్తంలో కాఫీ పొడి ఉత్పత్తి జరుగుతున్నప్పుడు కీటకాలను పూర్తిగా లేకుండా చేయడం అసాధ్యమని ఇప్పటికే ఎన్నో కంపెనీలు కూడా ఒప్పుకున్నాయి. అందుకే యుఎస్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ పది శాతం వరకు కీటకాలు కలవడాన్ని సురక్షితంగానే పరిగణిస్తోంది. అంటే మీ కాఫీలో నేరుగా బొద్ధింకలు ఉన్నాయని మేము చెప్పడం లేదు. కానీ బొద్దింకల అవశేషాలు ఉండే అవకాశం మాత్రం ఉంది. కానీ అవి మీ కంటికి కనిపించవు. కాఫీ గింజలతో పాటు అవి కూడా పొడి రూపంలో మారిపోయి ఉంటాయి.

55
కాఫీ వల్ల లాభాలు

కాఫీలో ఏదో మత్తు ఉంది. ఆ వాసన పీలిస్తేనే చాలు మానసిక స్థితి మారిపోతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పగటిపూట అలసట అనేది రాదు. ఉత్సాహం వెల్లివిరుస్తుంది. ఉత్సాహంగా పనులన్నీ చకచకా చేస్తారు.   అలాగని మరీ ఎక్కువగా తాగకూడదు. దీనిలో ఉండే కెఫీన్ మానసిక ఆరోగ్యాన్ని దిగజార్చే అవకాశం ఉంది. కాబట్టి రోజుకి ఒకటి లేదా రెండు కప్పులు కాఫీ తాగితే చాలు.. శారీరకంగా మానసికంగా సంతోషంగా ఉంటారు.

Read more Photos on
click me!

Recommended Stories