1. వెల్లుల్లి, ఉల్లిపాయ రసం (Garlic & Onion Juice)
ఇది పేను కొరుకుడుకు అత్యంత ప్రభావవంతమైన చిట్కా. వీటిలో ఉండే సల్ఫర్ రక్త ప్రసరణను పెంచి జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడుతుంది.
ఎలా వాడాలి?: ఉల్లిపాయ లేదా వెల్లుల్లిని దంచి రసం తీయండి. జుట్టు రాలిన ప్యాచ్‌లపై ఈ రసాన్ని రాసి 30 నిమిషాల తర్వాత కడిగేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేయండి.
2. మెంతుల పేస్ట్ (Fenugreek Paste)
మెంతులలో ఉండే ప్రోటీన్లు , నికోటినిక్ యాసిడ్ జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి.
ఎలా వాడాలి?: మెంతులను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే పేస్ట్‌లా చేసి ప్యాచ్‌లపై రాసి 40 నిమిషాల తర్వాత స్నానం చేయండి.
3. కలబంద (Aloe Vera Gel)
కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది తలలో దెబ్బతిన్న కణాలను బాగు చేస్తుంది.
ఎలా వాడాలి?: తాజా కలబంద గుజ్జును తీసుకుని జుట్టు రాలిన చోట మసాజ్ చేయండి. ఇది చర్మాన్ని చల్లబరిచి జుట్టు మొలవడానికి సహకరిస్తుంది.