Stomach Problem : పొట్టను కరిగించండిలా..

Published : Feb 05, 2022, 02:47 PM IST

Stomach Problem : ప్రస్తుతం చాలా మంది పొట్ట సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని కరిగించడానికి నానా రకాల పద్ధతులను ఫాలో అవుతున్నారు. అయితే ఈ పొట్టను కరిగించడంలో పీచు పదార్థాలు ఎక్కువగా లభించే డ్రై ఫ్రూట్స్, బ్రకలీ, అవకాడో, బెర్రీ ఫ్రూట్స్, యాపిల్ వంటి పదార్థాలు ఎంతో సహాయం చేస్తాయి. 

PREV
15
Stomach Problem : పొట్టను కరిగించండిలా..
belly fat

Stomach Problem : ప్రస్తుత కాలంలో పొట్ట సమస్య బాగా పెరిగిపోయింది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోవడానికి కారణాలు అనేకం. శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం, జంక్ ఫుడ్ , ప్రెసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల వంటి కారణాల వల్ల పొట్ట వస్తుంది. అయితే కొంతమందికి మాత్రం గ్యాస్ట్రిక్, జీర్ణ సంబంధిత సమస్యల వల్ల కూడా పొట్ట వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవేకావు.. మన జీవనశైలి, మన ఆహారపు అలవాట్ల వల్ల మన హార్లోన్లపై చెడు ప్రభావం పడుతుంది. దీనిమూలంగా హార్మోన్లు అసమతుల్యంగా ఉంటాయి. తద్వారా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల బారిన పడతారు. అంతేకాదు.. దీనివల్ల పెట్ట పెరుగుతుంది. 

25

పొట్టను కరిగించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా పీచుపదార్థాలు ఎక్కువగా లభించే ఆహార పదార్థాలనే తీసుకోవాలి. అవకాడో, బెర్రీ ఫ్రూట్స్, బీన్స్, డ్రైఫ్రూట్స్, తృణధాన్యాలు, యాపిల్ వంటి వాటిని మీ రోజు వారి ఆహారంలో ఉండేట్లు చూసుకోవాలి. ఎందుకంటే వీటిలో పీచు పదార్థం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. తద్వారా వీటిని తీసుకోవడం వల్ల జీర్ణం కూడా సులభంగా అవుతుంది. అలాగే ప్రతీరోజు శరీరానికి కావాల్సిన నీళ్లను తాగుతూ ఉండాలి. ఎన్ని ఎక్కువ నీళ్లు తాగితే అంత మంచిది. కాగా నీళ్లు ఎక్కువ శాతం ఉండే పండ్లు, కూరగాయలను కూడా ఎక్కువగా తీసుకోవాలి. వీటి వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. 
 

35

పొట్ట కరగాలంటే పొట్టపై ఒత్తిడిని పెంచే Exercises చేయాలి. అలాగే మెట్లు ఎక్కడం, బరువులు ఎక్కువుగా ఎత్తడం వంటివి చేస్తూ ఉండాలి. వీటి ద్వారా బెల్లీ ఫ్యాట్ కరడమే కాదు అక్కడి కండరాలు బలంగా మారతాయట. కాబట్టి పొట్ట చుట్టూ పేరుకు పోయిన వారు కొవ్వును కరిగించాలంటే ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటించాల్సిందే. 
 

45

యోగా, ధ్యానం చేయడం ద్వారా కూడా పొట్ట సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. వీటిని చేయడం వల్ల ఆరోగ్యంలో పాటుగా పొట్టను కూడా కరిగించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అనారోగ్యం బారిన పడకుండా ఉండాలన్నా, పొట్ట చుట్టూ కొవ్వు పెరగకుండా ఉండాలన్నా.. కొవ్వులు ఎక్కువ శాతం ఉండే ఫుడ్ ను తీసుకోకూడదు. 
 

55

అంతేకాదు ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ , నూనెలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే పొట్ట వచ్చే ప్రమాదమే ఉండదు. అందుకే పొట్ట చుట్టూ కొవ్వును పెంచే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అంతేకాదు ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తూ ఉండాలి. చక్కెరకు దూరంగా ఉండాలి. వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే మీ పొట్టను ఈజీగా కరిగించుకోవచ్చు. 
 

Read more Photos on
click me!

Recommended Stories