రొయ్యలలో జింక్, సెలీనియం, క్యాల్షియం, ఐరన్, విటమిన్ ఇ, బి, మెగ్నీషియం వంటి ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు (Omega 3 fatty acids), యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి కలుగజేసే ప్రయోజనాలు అనేకం.
శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది: రొయ్యలలో జింక్, సెలీనియం (Selenium) పుష్కలంగా ఉంటాయి. ఇవి మగవారిలో శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. మగవారిలో వీర్యకణాల (Sperm) సంఖ్య బాగా పెరిగి వీర్యం పెరుగుతుంది. దీంతో శృంగార కోరికలు పెరిగి ఎక్కువ సేపు కలయికలో పాల్గొంటారు.
చర్మ నిగారింపును పెంచుతుంది: రొయ్యలు ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి (Skin Beauty) కూడా సహాయపడతాయి. రొయ్యలలో విటమిన్ బి 12, విటమిన్ ఏ ఉంటాయి. ఇవి చర్మానికి మంచి నిగారింపును అందిస్తాయి. ఇవి రక్తకణాలను (Blood cells) శుభ్రపరిచి చర్మాన్ని తాజాగా మారుస్తాయి.
కండరాల నిర్మాణానికి సహాయపడతాయి: రొయ్యలలో ఉండే ప్రోటీన్లు (Proteins) మన శరీరంలోని కండరాల నిర్మాణానికి (Muscle building) కొత్త కణజాలం ఏర్పాటుకు సహాయపడతాయి.
బరువు తగ్గుతారు: రొయ్యలలో అతి తక్కువ ఫ్యాట్ (Very low fat) ఉంటుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే బరువు తగ్గుతారు (Lose weight).
రక్తహీనత సమస్య తగ్గుతుంది : రొయ్యలలో ఐరన్ (Iron) పుష్కలంగా ఉంటుంది. కనుక రక్తహీనత (Anemia) సమస్యలతో బాధపడేవారు రొయ్యలను తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
జ్ఞాపక శక్తి పెరుగుతుంది: రొయ్యలను తీసుకుంటే మెదడుకు సంబంధించిన వ్యాధులు రాకుండా కాపాడుతాయి. మెదడు పనితీరును మెరుగుపరిచి మతిమరుపు (Forgetfulness) సమస్యలు తగ్గి జ్ఞాపకశక్తి (Memory), పెరుగుతుంది.
ఎముకలకు బలాన్ని అందిస్తాయి.: రొయ్యలలో క్యాల్షియం (Calcium), ప్రొటీన్లు (Proteins) పుష్కలంగా ఉంటాయి. ఇవి ముసలితనంలో వచ్చే ఎముకల బలహీనతను తగ్గించి ఎముకలకు బలాన్ని అందిస్తాయి.
నరాల బలహీనత తగ్గిస్తాయి: రొయ్యలలో ఉండే మెగ్నీషియం (Magnesium) నరాల బలహీనతను తగ్గిస్తాయి. శరీర దారుఢ్యానికి సహాయపడతాయి. కనుక తీసుకొనే డైట్ లో రొయ్యలు తెలుసుకోవడం మంచిది.
గుండె ఆరోగ్యంగా ఉంటుంది : రొయ్యలను తీసుకుంటే రక్తంలో ఉన్న గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉంటాయి. ఇవి రక్తపోటును (Blood pressure) కూడా అదుపులో ఉంచి గుండె జబ్బులను తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా (Heart health) ఉంటుంది.
వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది: రొయ్యలలో ఉండే పోషకాలు శరీరానికి శక్తిని అందించి వ్యాధులతో (Diseases) పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. శరీర వ్యాధినిరోధక శక్తిని (Immunity) పెంచి అనేక అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి.