లవ్ హ్యాండిల్స్ ను వదిలించుకోవడానికి బెస్ట్ యోగాసనాలు ఇవే..

First Published Dec 4, 2022, 11:05 AM IST

కొన్ని యోగాసనాలు లవ్ హ్యాండిల్స్ ను టోన్ చేయడానికి, మీ పొత్తి కడుపు కండరాలను బలోపేతం చేయడానికి, బలాన్ని పెంచడానికి ఎంతో సహాయపడతాయి. అవేంటంటే.. 
 

ఒకప్పుడు వయసులో ఉన్న ఆడవారు నాజుగ్గా, వంపులు తిరిగిన నడుముతో సన్నజాజిలా ఉండేవారు. ఇలాంటి వారు ఇప్పుడు కూడా ఉన్నారు. సినిమా హీరోయిన్లు, రోజూ వ్యాయామం చేసే కొంతమంది సాధారణ జనాలే ఇలా ఉంటున్నారు. కానీ ప్రస్తుత కాలంలో 40 ఏళ్ల ఆడవారే కాదు.. 25 ఏండ్ల పడుచు పిల్లలు కూడా నడుము చుట్టూ కొవ్వు, తొడలు, పిరుదులు, చేతుల్లో పెరిగిపోయిన కొవ్వుతో ఇబ్బంది పడుతున్నారు. శరీరంలో ఇలా కొవ్వు పేరుకుపోవడాన్నే లవ్ హ్యాండిల్స్ అంటారు. ఇలాంటి వారు టైట్ గా ఉండే జీన్స్ లు, కుర్తాలు వేసినా, కూర్చున్నాఆ భాగాలు మరింత బాగా కనిపిస్తాయి. ఈ లవ్ హ్యాండిల్స్ తో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొద్దిగా కష్టపడితే ఈ కొవ్వును కొద్దిరోజుల్లోనే కరిగించేయొచ్చు. ఇందుకోసం కొన్ని యోగాసనాలు మీకు బాగా సహాయపడతాయి. ఈ ఆసనాల వల్ల మీరు తిరిగి నెలవంకలాంటి నడుమును మీ సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి యోగాసనాలు వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఉత్కటాసన - కుర్చీ భంగిమ

ఈ యోగాసనంలో మీ మోకాళ్లు తుంటి వెడల్పుగా, వేరుగా వంటి వంగి ఉంటాయి. పిరుదులు వెనక్కి, ఛాతి ముందుకు ఉంటుంది. మీ రెండు చేతులను చెవులకు అనుగుణంగా తలపైకి ఉంచండి. ఇక మీ వెన్నెముక నిటారుగా ఉండాలి. అలాగే మీ కటి నేలకు సమాంతరంగా ఉండాలి. మీ మోకాళ్లు 90 డిగ్రీల కోణంలో వంగాలి. అలాగే మీ చీలమండలు, మోకాళ్లను సరళరేఖలో సమలేఖనం చేయాలి. 
 

ఊర్వముఖ స్వనాసనం

ఈ భంగిమలో మీరు మీ బరువు మొత్తాన్ని మీ అరచేతులపై, మీ పాదాల పైభాగాలపై ఉంచాలి. ఈ భంగిమలో మీ వెనుక వీపుపై ఒత్తిడి పడుతుంది. ఈ యోగాసనంలో మీ పాదాలు కింది ముఖంగా ఉండాలి. మీ కడుపు నేలపై ఉండాలి. మీ చేతులు మీ మొండెం పక్కన ఉండాలి. మీ అరచేతులను పక్కటెముకలకు దగ్గరగా ఉంచండి. మీ అరచేతులను నేలపై గట్టిగా నొక్కేటప్పుడే శ్వాస తీసుకోండి. నెమ్మదిగా మీ మోకాళ్లు, తుంటి, మొండెన్ని చాప మీది నుంచి పైకి లేపండి. మీ చేతులను బలంగా, మోచేతులను తిన్నగా ఉంచండి. 

उत्तानासन

పాదహస్తాసనం

ముందుగా లోతుగా శ్వాసను పీల్చండి. ఆ తర్వాత నిటారుగా నిలబడి శరీరాన్ని సాగదీయండి. ఆ తర్వాత కటి భాగం నుంచి వంచండి. దీనిలో మీ బాడీ 90 డిగ్రీల కోణంగా ఉండాలి. తర్వాత మీ పాదాలకు ఇరువైపులా మీ అరచేతులను ఉంచండి. ఆ తర్వాత మీ మోకాలు మీ ముక్కుకు దగ్గరగా వచ్చేలా చేయండి. మీ తల  మోకాళ్లకు ఆనేలా చూడాలి. 

సంతోలనాసన- ప్లాంక్ భంగిమ

ఈ భంగిమలో మీరు మీ కడుపుపై పడుకోవాలి. మీ అరచేతులను మీ భూజాల కింద ఉంచండి. అలాగే మీ ఎగువ శరీరం, కటి, మోకాళ్లను పైకి ఎత్తండి. మీ కాలి వేళ్లను నేలపై ఉంచండి. మీ మోకాలు, కటి, వెన్నెముక సమలేఖనంలో ఉండాలి. మీ మణికట్టును మీ భుజాల కింద మీ చేతులను నిటారుగా ఉంచండి. కొద్ది సేపటి తర్వాత తిరిగి యథాస్థానానికి రండి. 
 

వశిష్టాసనం-సైడ్ ప్లాంక్ భంగిమ

ఈ భంగిమలో ముందుగా మీరు సైడ్ ప్లాక్ భంగిమలో ఉండండి. ఆ తర్వాత మీ కుడి చేతిని నేలపై నుంచి పైకి ఎత్తేటప్పుడు మీ ఎడమ అరచేతిని ఉపరితలంపై బలంగా ఉంచండి. మీ మొత్తం శరీరాన్ని కుడి వైపునకు తిప్పండి. అలాగే మీ కుడి కాలును నేలపై నుంచి పైకి లేపండి. మీ ఎడమ కాలు మీదుగా ఉంచండి. మీ మడమలు, మోకాలు, పాదాలను ఒకేసారి తాకేట్టు చూసుకోండి. చేతులు, భుజాలు ఒకే సరళరేఖలో ఉండాలి. దీనిలో మీరు తల తిప్పి మీ కుడిచేతివైపు చూడాలి. 

click me!