శరీరంలో ఈ భాగాల్లో కొవ్వు పేరుకుపోతే ప్రమాదకరమైన రోగాలొస్తయ్ జాగ్రత్త..

First Published Dec 3, 2022, 4:57 PM IST

కడుపు, రొమ్ము, మెడ, నడుము భాగాల్లో కొవ్వు పేరుకుపోతే ప్రమాదకరమైన రోగాలొచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ భాగాల్లో కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 
 

అమ్మాయిలు పెద్ద సైజు రొమ్ములనే ఇష్టపడతారు. కానీ పెద్ద సైజు రొమ్ముల్లో కొవ్వు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రొమ్ముతో సహా శరీరంలోని కొన్ని భాగాల్లో ఎక్కువ కొవ్వు పేరుకుపోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని  ఆరోగ్య నిపుణులు  హెచ్చరిస్తున్నారు. అధిక క్యాలరీలు ఉండే ఆహారం తీసుకునే వారు, శారీరక శ్రమ చేయని వారి శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు శరీర ఆకారం మారుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరంలోని కొన్ని భాగాలలో కొవ్వు పేరుకుపోవడం ప్రమాదకరమైన రోగాలకు సంకేతం. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే వాపునకు దారితీస్తుంది. అసలు ఏ భాగంలో కొవ్వు పేరుకుపోకూడదు.. ఒక వేళ అక్కడే కొవ్వు ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పిరుదులు

పిరుదులు, తొడల్లో కొద్దిగా కొవ్వు పేరుకుపోయినా పెద్దగా వచ్చే సమస్య ఏం లేదు. కానీ అక్కడి కండరాలపై ఒత్తిడిని తెచ్చేంత కొవ్వు పేరుకుపోకూడదు. ఫ్లోరిడా సాన్ఫోర్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోని  డయాబెటిస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వెనుక భాగంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. సాధారణంగా గుండెపోటుకు గురయ్యే మహిళల్లో వీపు భాగంలో కంటే పొత్తి కడుపు ప్రాంతంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది. పొత్తికడుపులో కొవ్వు పేరుకుపోవడం వల్ల డయాబెటీస్, హార్ట్ ఎటాక్ వంటి రోగాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 
 

రొమ్ముల్లో కొవ్వు

పెద్ద సైజు రొమ్ములను అందానికి చిహ్నంగా భావిస్తారు. జన్యుపరమైన కారణాల వల్ల రొమ్ముల పరిమాణం పెద్దదిగా ఉంటుంది. అయితే రొమ్ములు ఎంత పెద్దవిగా ఉంటే.. కొన్ని వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం.. పెద్ద రొమ్ములు ఉన్న 20 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి.. వచ్చే పదేళ్లలో డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. రొమ్ముల్లో చెడు కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఎక్కువగా ఉండటమే దీనికి మూల కారణం. పెద్ద రొమ్ములు ఉన్న మహిళలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని నిరూపించబడింది.
 

కడుపు కొవ్వు

చెడు కొవ్వు ఆరోగ్యాన్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఇది గుండె జబ్బులు, పక్షవాతం స్ట్రోక్, క్యాన్సర్ మొదలైన వాటి రోగాల ప్రమాదాల్ని పెంచుతుంది. అలాగే నిరాశ, మతిమరుపు, మధుమేహానికి కూడా దారితీస్తుంది. ఈ చెడు కొవ్వు లేదా అసంతృప్త కొవ్వు కడుపు, నడుము భాగంలో ఎక్కువగా పేరుకుపోతుంది. వీపు కంటే నడుము, కడుపు చుట్టుకొలత ఎక్కువగా ఉన్న వాళ్లకు గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నడుము చుట్టుకొలతను తగ్గించడానికి మీరు కార్బోహైడ్రేట్ల తీసుకోవడం తగ్గించాలి. అలాగే ప్రోటీన్ ఫుడ్ ను తీసుకోవడం పెంచాలి. సరైన వ్యాయామం చేయాలి.
 

మెడ భాగంలో కొవ్వు

చాలా మందికి మెడ భాగంలో కూడా  కొవ్వు పేరుకుపోతుంది. కానీ ఇది గుండె సమస్యలకు దారితీస్తుంది. లేదా ఇంతకు ముందే గుండె సమస్యలు ఉంటే.. అవి ఇంకా ఎక్కువవుతాయి. ఊపిరితిత్తుల సమస్యలు,  నిద్ర రుగ్మతలు కూడా రావొచ్చు. అలాగే హార్మోన్లు హెచ్చు తగ్గులకు లోనవుతాయి. పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి.

click me!