అబ్బాయిలు బట్టలు లేకుండా పడుకోవడం వల్ల ఇన్ని లాభాలున్నాయా?

First Published Dec 4, 2022, 9:52 AM IST

నగ్నంగా నిద్రపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ.. ఇన్నీ కాదు.. ముఖ్యంగా అబ్బాయిలకు. పురుషులు బట్టలు ధరించకుండా నిద్రపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారని నిపుణులు చెబుతున్నారు. 

మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా చాలా అవసరం. హాయిగా, ప్రశాంతంగా నిద్రపోతేనే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. మరెన్నో రోగాలొచ్చే ముప్పు తప్పుతుంది. ఇకపోతే రాత్రిళ్లు బట్టలు లేకుండా నిద్రపోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీర ఊష్ణోగ్రత మీ నిద్ర నాణ్యతలో ఎన్నో మార్పులను తెస్తుంది. రాత్రిపూట బట్టలు వేసుకుని నిద్రపోవడం వల్ల శరీరానికి ఇబ్బందికలుగుతుంది. దీనివల్ల అర్థరాత్రి  మేల్కోవడం, తరచుగా నిద్రలేవడం, సరిగ్గా నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఇక సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల శరీరం ఎనర్జిటిక్ గా ఉండదు. అసలు బట్టలు లేకుండా పడుకోవడం వల్ల పురుషులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వయోజన వ్యక్తి రోజుకు కనీసం ఏడు గంటలైనా ఖచ్చితంగా నిద్రపోవాలి. లేదంటే ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ఎన్నో ప్రమాదకరమైన రోగాలొచ్చే ప్రమాదం కూడా ఉంది. తక్కువ ఉష్ణోగ్రతలో నిద్రపోవడం వల్ల శరీరం నుంచి బ్రౌన్ ఫ్యాట్ (మంచి కొవ్వు) రిలీస్ అవుతుంది. ఇది రక్తంలో ఉన్న అదనపు చక్కెరను తొలగిస్తుంది. దీంతో జీవక్రియ రేటును పెంచుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బట్టలతో నిద్రపోవడం వల్ల పునరుత్పత్తి ఆరోగ్యంపై చెబు ప్రభావం పడుతుంది. దీనివల్ల పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గుతుంది. ఎందుకంటే బిగుతుగా ఉండే బట్టలను వేసుకోవడం వల్ల వీర్యకణాలపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే రాత్రిళ్లు బట్టలు లేకుండా నిద్రపోండి. ఇది మీ వీర్యకణాల సంఖ్యను పెంచేందుకు సహాయపడుతుంది. ఒకవేళ బట్టలను వేసుకున్నా అవి వదులుగా ఉండేట్టు చూసుకోండి. 

రాత్రిళ్లు బట్టలు తీసేసి పడుకోవడం వల్ల మన  శరీరానికి ఆక్సిజన్ పుష్కలంగా అందుతుంది. ఇది ఎన్నో రోగాల ప్రమాదాల్ని తగ్గిస్తుంది. అలాగే శ్వాసను తీసుకోవడాన్ని సులువు చేస్తుంది. రాత్రిళ్లు బాగా నిద్రపోతే మెదడు ట్యాక్సిన్స్ మటుమాయమవుతాయి. అందుకే రాత్రిళ్లు బట్టలు లేకుండా పడుకోవడానికి ట్రై చేయండి. 
 

బ్రౌన్ ఫ్యాట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇది మన శరీరంలోని ఏ ఇతర అవయవం కంటే 300 రెట్లు ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. మనం బర్న్ చేసే వాటికంటే ఎక్కువ కేలరీలను తిన్నప్పుడు సాధారణంగా మన శరీరంలో తెల్ల కొవ్వు (చెడు కొవ్వు) పేరుకుపోతుంది. ఈ బ్రౌన్ ఫ్యాట్ (మంచి కొవ్వు) వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీంతో తెల్లకొవ్వులో నిల్వ చేయబడ్డ శక్తి కరుగుతుంది. ఈ బ్రౌన్ ఫ్యాట్ పిల్లల్లో పుష్కలంగా ఉంటుంది. అందుకే చిన్న పిల్లలు వెచ్చగా ఉంటారు. ఇది మన శరీరంలో అదనంగా ఉన్న కేలరీలను కరిగించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. 

నగ్నంగా భాగస్వామితో పడుకోవడం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ బాగా రిలీజ్ అవుతుంది. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇది గుండెను రక్షిస్తుంది. ఎందుకంటే ఈ హార్మోన్ అధిక రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆందోళనను తగ్గిస్తుంది. అంతేకాదండోయ్ మంచంపై భాగస్వామితో పడుకునే పురుషులు శారీరకంగానే కాదు మానసికంగా కూడా ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉన్నారని పరిశోధనలను స్పష్టం చేస్తున్నాయి. 
 

click me!