అమ్మాయిలూ.. వీటిని తింటున్నారా? లేదా?

First Published | Jan 31, 2022, 3:02 PM IST

మగవారికంటే ఆడవారికే అధిక పోషకవిలువలున్న ప్రత్యేక ఆహారం అవసరం. వాటిని తీసుకుంటేనే వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అంతేకాదు వారి శరీరం సక్రమంగా పనిచేయడానికి  స్పెషల్ ఫుడ్ ను ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. 
 

ఇంట్లోని అందరికీ ఏది కావాలంటే అది చేసే పెట్టే ఆడవారు తమకు ఏం కావాలో తెలుసుకోరు. అంతెందుకు వారి ఆరోగ్యం బాగుందా? లేదా? అనే విషయాన్నికూడా పట్టించుకోరు. ఎంతైనా ఇంట్లోవారి ఆరోగ్యాన్ని, వారి యోగ క్షేమాలను నిరంతరం చూసే మహిళలు వారి ఆరోగ్యం పట్ల కొంచెమైనా శ్రద్ధచూపరనేది వాస్తవం. అందుకే ఆడవారు ఎక్కువ మొత్తంలో రక్తహీనత , పోషకాహారలేమి వంటి అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఎలాంటి సమస్యలు రాకూడదన్నా వారి ఆరోగ్యానికి ఎటువంటి డోకా ఉండకూడదన్నా.. వీరు స్పెషల్ ఫుడ్ తీసుకోవాల్సిందే. స్పెషల్ అంటే ఎంత ఖర్చుచేయాల్సొస్తదోనని మీరేం కంగారు పడకండి. ఈ ఆహారానికి మీరు ప్రత్యేకించి ఖర్చు చేయాల్సిన పనిలేదు. ఆడవారి శరీర పనితీరు మెరుగ్గా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

పాలకూర: పాలకూర పేరు వింటేనే చాలు మొఖం వికారంగా పెడుతుంటారు. కానీ ఈ పాలకూరలో ఎన్నో పోషకవిలువలు దాగున్నాయి. అందుకే ప్రతి స్త్రీ ఈ పాలకూరను తప్పకుండా తినాల్సిందే. ఎందుకంటే ఈ ఆకుకూరలో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. అది ఆడవారిలో వచ్చే ప్రీ మెన్‌స్ట్రుల్‌ సిండ్రోమ్‌ లక్షణాలు రాకుండా చేస్తుంది. అంతేకాదు రక్తపోటు సమస్యను తగ్గించడానికి, ఎముకలను బలంగా చేసేందుకు,  ఆస్తమా సమస్యను నియంత్రించడంలోఈ పాలకూర ముందుంటుంది.

Latest Videos


అవిసె గింజలు:  తక్కువ ధరకే లభ్యమయ్యే అవిస గింజలు గుండె ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఈ అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు మెండుగా లభిస్తాయి. ఈ గింజల్లో నొప్పిని, వాపును తగ్గించే Anti-inflammatory గుణాలు ఉంటాయి. అంతేకాదు వీటిని ప్రతిరోజూ తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి కూడా బయటపడతారు. అందుకే ఆడవారు వీటని క్రమం తప్పకుండా తీసుకోవాలి.

టమాట: టమాటాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయా అని వీటిని చిన్న చూపు చూడకండి. ఎందుకంటే టమాటాలల్లో ఎన్నో దివ్య ఔషదగుణాలున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అన్ని కూరగాయల్లో ఇది శక్తివంతమైనది తెలుసా. ఈ పండులో ఉండే లైకోపీన్ అనే పిగ్రెంట్ ప్రమాదకరమైన  హార్ట్ ప్రాబ్లమ్స్, రొమ్ము క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. అంతేకాదు శరీరంలోని అధిక కొవ్వును కూడా కరిగిస్తుంది. అలాగే ఎముకలు బలంగా, ధ్రుడంగా ఉండేందుకు ఎంతో సాయపడుతుంది. 
 

క్రాన్ బెర్రీస్: ఆడవారిలో తరచుగా వచ్చే యూరినరీ ట్రాక్ ఎన్ఫెక్షను రాకుండా ఉండేందుకు చిన్నగా ఎర్రగా ఉండే క్రాన్ బెర్రీల్ ఎంతో  ఉపయోగపడతాయి. ఈ పండ్లలో  Anti-inflammatory, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో లభిస్తాయి. ఇవి మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 
 


ఓట్స్:  ఓట్స్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు Premenstrual Syndrome వల్ల వచ్చే భావోద్వేగాలను కూడా ఇవి నియంత్రించగల సామర్థ్యం కలిగి ఉంటాయి. అలాగే  జీర్ణవ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. వీటిని తినడం వల్ల కలిగే మరో బెనిఫిట్ ఏంటో తెలుసా.. వీటిని ఎంతగా తిన్నా.. బరువు పెరుగుతామనే భయమే లేదు. అంతేకాదు శరీర బరువును కూడా అదుపులో ఉంచుతుంది. కాబట్టి మీరు వీటిని ఎలాంటి భయాలు లేకుండా తొనొచ్చు. 
 

click me!