ఈ టీ గుండెకు చాలా మంచిది తెలుసా..?

First Published | Jan 31, 2022, 1:03 PM IST

ఈ టీని సరైన పరిమాణంలో ఎక్కువ కాకుండా జాగ్రత్త తీసుకుంటే టీ తాగితే..  చాలా ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

tea

భారతీయులు టీ ని ఎక్కువగా ఆస్వాదిస్తారు. కొందరు టీ ఆరోగ్యానికి చాలా మంచిది అని వాదిస్తుంటే.. కొందు మాత్రం.. అనారోగ్యానికి కారణమౌతుందని వాదించేవారు కూడా ఉన్నారు. టీ పొడిలో ఉండే కెఫిన్ కంటెంట్ కారణంగా.. మనకు చెడు జరుగుతుందని అందరూ చెబుతుంటారు. కానీ.. ఈ టీని సరైన పరిమాణంలో ఎక్కువ కాకుండా జాగ్రత్త తీసుకుంటే టీ తాగితే..  చాలా ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.


ప్రతిరోజూ టీ తాగడం వల్ల రక్తంలోని  కొలిస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాదు క్యాన్సర్, గుండె జబ్బులను నివారించడంలోనూ ఇది సహాయపడుతుంది. అయితే.. ఏ రకం టీ తాగడం వల్ల మనకు ఈ ప్రయోజనాలు  చేకూరనున్నాయో.. నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం..

golden tips black tea

1.బ్లాక్ టీ..

చాలా మంది బ్లాక్ టీ తాగడానికి ఇష్టపడతారు. ఇందులో పంచదార కలపం కదా ఆరోగ్యానికి మేలు చేస్తుందని వారు భావిస్తుంటారు. కానీ..  ఈ బ్లాక్ టీ లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ టీ ని ప్రతిరోజూ రెండు, మూడు కప్పులు తీసుకునేవారిలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తక్కువగా ఉన్నాయని.. వారి కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయని నిపుణుల పరిశోధనలో తేలింది. అయితే.. గుండె ఆరోగ్యానికి మాత్రం ఈ టీ అస్సలు మంచిది కాదని వారు చెబుతున్నారు.


2.గ్రీన్ టీ..
గుండె నిపుణుల అభిప్రాయం ప్రకారం, కృత్రిమ స్వీటెనర్ లేకుండా ప్రతిరోజూ   3-4 కప్పుల గ్రీన్ టీ తాగొచ్చు. ఇది LDL కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తుందని  పరిశోధనలో తేలింది. ఇది గుండెకు మేలు చేస్తుంది. ఇది అథెరోస్క్లెరోసిస్, ధమనులలో ఫలకం పేరుకుపోవడాన్ని నిరోధించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కూడా కలిగి ఉంటుంది. గుండె మేలు ప్రకారం.. ఈ గ్రీన్ టీ తీసుకోవడం ఉత్తమం.
 

3.వైట్ టీ..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది స్వచ్ఛమైన టీ , గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వైట్ టీలో ఉండే ఫ్లేవనాయిడ్లు  గుండె ధమనులను విస్తరించడంలో సహాయపడతాయి. ఇది రక్తపోటును తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తం గడ్డకట్టడాన్ని కూడా నివారిస్తుందని  నిపుణులు సూచిస్తున్నారు.

4.చమేలీ టీ..
ఇది హెర్బల్ టీ...  ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. గుండె సమస్యలతో బాధపడుతున్నవారు.. ఈ టీ తాగడం వల్ల...  ప్రశాంతంగా నిద్రపోగలరు. గుండె ఆరోగ్యానికి కూడా సహాయం చేస్తుంది.

Latest Videos

click me!