వైవాహిక జీవితం ఎంతో మధురమైనది. ప్రతి ఒక్కరూ ఈ బంధంలోకి అడుగుపెట్టాల్సిందే. అయితే పెళ్లి అయిన కొన్ని రోజులకే భార్యభర్తలిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్తలు వస్తుంటాయి. వాటిని చక్కగా పరిష్కరించుకుంటూ పోతేనే లైఫ్ సంతోషంగా, ఎంతో సుఖంగా ఉంటుంది. అయితే వైవాహిక బంధంతో విసుగు వచ్చేసింది అంటూ కొంతమంది తమ స్నేహితులతో చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వారు కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే వారి లైఫ్ లో జరిగే ప్రతీదీ అద్బుతంలాగే కనిపిస్తుంది. అలా అవ్వాలంటే ప్రతి రోజూ ఈ పద్దతులను అస్సలు మిస్ చేయకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కౌగిలి: భార్యాభర్తలన్నాకా.. వారి కోసం కొంత సమయాన్ని వెచ్చించుకోవడం ఎంతో ముఖ్యం తెలుసా.. ఈ సమయంలోనే మీ రిలేషన్ షిప్ మరింత బలపడుతుంది. ఒకరి విషయాలను ఒకరు తెలుసుకోవడానికి సమయం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఆ సమయంలో మీ భాగస్వామిపై ఉన్న ప్రేమను తెలుపగలుగుతారు. అందులోనూ ఆ సమయంలో కౌగించుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి తెలుసా. అవును కౌగిలించుకోవడం వల్ల మనసులో ఉన్న నెగిటీవ్ థాట్స్ దూరమయ్యి.. మీపై ఉన్న ప్రేమ పెరుగుతుంది. అంతేకాదు మీ కౌగిలిలో వారు సెక్యూర్ గా ఫీలవుతారు. అందుకే ప్రతిరోజూ మార్నింగ్ పూట కౌగిలి కోసం సమయాన్ని కేటాయించుకోండి. ఇది మీ బంధాన్ని మరింత మధురంగా, ఆనందంగా చేస్తుంది.
మెడిటేషన్: మెడిటేషన్ వల్ల మానసిక ఆరోగ్యంతో పాటు.. శారీరక ఆరోగ్యం కూడా కలుగుతాయి. అందుకే ప్రతిరోజూ ఉదయం పూట భార్యాభర్తలిద్దరూ మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోండి. దీని వల్ల మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. అంతేకాదు.. ఇలా చేయడం వల్ల మీలో పాజిటీవ్ ఎనర్జీ కూడా వస్తుంది. అందుకే ప్రతిరోజూ ఇవి క్రమం తప్పకుండా పాటించండి.
బ్రేక్ ఫాస్ట్: ఒకరు చేస్తుంటే.. ఒకరు తినడం కాకుండా ఒకే సమయంలో భార్య భర్తలిద్దరూ తినేటట్టు ప్లాన్ చేసుకోండి. అయినా ప్రస్తుత కాలంలో భర్తలు వారి భార్యలకు వంట పనుల్లో బాగానే సాయం చేస్తున్నారు. పూర్వం అయితే ఇలా లేదు కాబట్టి వారు వేర్వేరు సమయాల్లో తినేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అంత దారుణంగా ఏమీ లేవు కాదా.. అందుకే మీ భార్య వంటచేస్తుంటే మీరు తినడం చేయకుండా.. ఇద్దరూ వంటపూర్తి చేసుకుని కలిసి తింటే బాగుంటుంది. ఇలా చేయడం వల్ల మీరు హ్యాపీ.. నా కోసం ఇంకా తినకుండా ఉన్నారా అని అని భాగస్వామి కూడా హ్యాపీగా ఫీలవుతుంది. అందుకే ఇద్దరూ కలిసే తినటట్టే ప్లాన్ చేసుకోండి. ఇది మీ హ్యాపీ లైఫ్ కు దారులు వేస్తుంది.
భర్యా భర్తలిద్దరూ కలిసి షవర్ చేస్తే కూడా మీ ఆనందం రెట్టింపవుతుంది. ఇలా కలిసి షవర్ చేస్తే Intimacy level కూడా పెరుగుతుందట. అంతేకాదు దీనివల్ల మీరు హ్యాపీగా కూడా ఫీలవుతారట. కాబట్టి ఉదయం పూట కలిసి షవర్ చేయడానికి ప్లాన్ చేసుకోండి.
వ్యాయమం: భార్యా భర్తలు ఎంత ఎక్కువ సమయాన్ని కలిసి గడిపితే వారి జీవితం అంత సంతోషంగా ఉంటుంది. అందులో కలిసి వ్యాయామం చేయడం వల్ల కొంత సమయం స్పెండ్ చేసినట్టుగా కూడా ఉంటుంది. అయితే వాకింగ్ లేదా జుంబా యోగా లాంటివి కలిసి చేయండి. ఇది మీ బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేస్తాయి.
కాంప్లిమెంట్స్: వివాహ బంధంలో కాంప్లిమెంట్స్ ఎంతో ముఖ్యమైనవి తెలుసా.. భార్య గానీ, భర్త గానీ ఎదైన వర్క్ చేసినప్పుడు గానీ.. అందంగా ఉన్నావనో, డ్రెస్ బాగుందనో, లేకపోతే వంట రుచికరంగా అయ్యిందనో కాంప్లిమెంట్స్ ఇస్తే వారు ఎంతో సంతోషిస్తారు. మీకు తెలుసా.. ఇలాంటి విషయాలే భాగస్వాములను మరింత సంతోషంగా ఉంచగలుగుతాయి. అందుకే విషయం చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా కాంప్లిమెంట్స్ ఇవ్వడం మర్చిపోకండి. దీని వల్ల మీ బందం మరింత బలపడుతుంది కూడా.
ముద్దులు పెట్టడం: ఒకరిపై ఉన్న ఇష్టాన్ని, ప్రేమను తెలపడంలో ముద్దులే ముందుంటాయి. మాటల్లో మీ భాగస్వామిపై ఉన్న ప్రేమను తెలియజేయరాకపోతే.. ముద్దు పెట్టండి. వారిని మీరు ఎంత ఇష్టపడుతున్నారో అర్థమవుతుంది. ముద్దుకు అంతుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ముద్దు ప్రేమకు ప్రతీక. అందుకే ఎలాంటి బిడియం లేకుండా మీ భాగస్వామిపై ముద్దుల వర్షం కురిపించండి. ఇది చిన్న విషయమే అనిపించినా మీరు హ్యీపీగా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుంది .