Published : Apr 20, 2026, 11:54 AM ISTUpdated : Apr 20, 2026, 12:04 PM IST
చాాలామంది డీమార్ట్‌కు వెళ్లేది డబ్బు ఆదా చేద్దామనే. కానీ అక్కడికి వెళ్లాక అనవసరమైనవి కొని, ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. దీన్ని నివారించాలంటే షాపింగ్‌కు వెళ్లేముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే అనవసర ఖర్చులు తగ్గి, డబ్బు ఆదా అవుతుంది.
DMart : పట్టణాల్లోని మధ్యతరగతి కుటుంబాలకు నెల మొదట్లో లేదా చివర్లో డీమార్ట్‌కు వెళ్లడం అలవాటైపోయింది. తక్కువ ధరకే నిత్యావసరాలు దొరుకుతాయని చాలామంది వెళ్తారు. కొందరు ఆన్‌లైన్‌లోనూ ఆర్డర్ చేస్తారు. అందరి లక్ష్యం ఒక్కటే - నెలవారీ ఖర్చు తగ్గించి, డబ్బు ఆదా చేయడం.
25
నెలసరి ఖర్చు ఆదా
అయితే నిజానికి ఏం జరుగుతోంది..? డీమార్ట్ కి వెళ్లేవారు అవసరమైన వస్తువులే కాదు అవసరం లేనివి కూడా కొంటుంటాారు. ఇలా లిస్ట్ లేకుండా వెళ్లడంతో అవసరానికి మించి వస్తువులు ట్రాలీలో పడిపోతాయి. 'ఇది ఆఫర్‌లో ఉంది కదా', 'అది కొనేద్దాం' అనే ఆలోచనలతో వెంటనే నిర్ణయం తీసుకుంటారు. అసలు విషయం బిల్ కౌంటర్ దగ్గర తెలుస్తుంది. ఆదా చేద్దామని వచ్చి, ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు.
35
ఖర్చు తగ్గించే మార్గాలు...
ఇలా డీమార్ట్ మీకు తెలియకుండానే పర్స్ ను ఖాళీ చేస్తోందా..? అయితే ఖర్చులు తగ్గించుకునేందుకు సింపుల్ పరిష్కారం ఉంది. మీరు ఈసారి డీమార్ట్ కు వెళ్లేముందే పక్కా ప్లాన్ రెడీ చేసుకొండి… ఏది అవసరమో దానిపైనే దృష్టిపెట్టండి. మీకు, కుటుంబసభ్యులకు అవసరమైనవి, ఇంటికి కావాల్సిన వస్తువుల లిస్ట్ తయారు చేసుకోండి. బియ్యం, పప్పు, నూనె, సబ్బు, డిటర్జెంట్ వంటివి స్పష్టంగా రాసుకోండి. ఈ లిస్టే మీ షాపింగ్‌కు దారి చూపిస్తుంది. తప్పుడు దారి పట్టకుండా కాపాడుతుంది.
అంతేకాదు ఆకలితో అస్సలు షాపింగ్‌కు వెళ్లొద్దు. కడుపు ఖాళీగా ఉంటే చాక్లెట్లు, బిస్కెట్లు, స్నాక్స్ వైపు మనసు లాగేస్తుంది. దానికి బదులుగా, ముందు నిత్యావసరాల సెక్షన్‌కు వెళ్లి, కొనాల్సినవి కొనేయండి. ఆ తర్వాత అవసరమైతేనే ఇతర వస్తువుల వైపు చూడండి. ఇది మీ ట్రాలీని, బిల్లును కంట్రోల్‌లో ఉంచుతుంది.
55
డీమార్ట్ షాపింగ్ ను తెలివిగా ప్లాన్ చేసుకొండి..
ఇలాంటి చిన్నచిన్న అలవాట్లే పెద్ద మొత్తంలో డబ్బును ఆదా చేస్తాయి. పక్కా ప్లాన్‌తో షాపింగ్ చేస్తే, అనవసరమైన ఖర్చులో 50 నుంచి 80 శాతం వరకు తగ్గించుకోవచ్చు. మీ డీమార్ట్ ప్రయాణాన్ని ఓ 'సేవింగ్ మిషన్'గా మార్చుకోండి. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కాదు, తెలివైన ఎంపికలే మీ డబ్బును కాపాడతాయి.