ఫంగల్ చర్మ సంక్రామ్యతలు (Fungal skin infections): ఈ సీజన్ లో శిలీంధ్రాలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా ఇవి వేడి, తేమతో కూడిన పరిస్థితుల్లోనే వృద్ధి చెందుతాయి Ringworm తో పాటుగా ఇతర అంటువ్యాధులు కాలి వేళ్ల మధ్య, రొమ్ముల కింద, అండర్ ఆర్మ్స్, గజ్జలు వంటి శరీర మడతలలో కనిపిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారిలో ఇటువంటి అంటువ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.