కొన్నే కొన్ని నిమిషాల ధ్యానంతో ఎన్నిరోగాలు తగ్గిపోతాయో తెలుసా..?

Published : Jun 27, 2022, 04:58 PM IST

meditation Benefits: ధ్యానం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇది మన మెదడు పనితీరును, మనస్సును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. 

PREV
110
కొన్నే కొన్ని నిమిషాల ధ్యానంతో ఎన్నిరోగాలు తగ్గిపోతాయో తెలుసా..?
meditation

ధ్యానం మన మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి, కొత్త కొత్త ఆలోచనలు రావడానికి సహాయపడే ఒక అభ్యాసం. ధ్యానంతో శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ధ్యానం మన మెదడును మెరుగుపరచడానికి ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.. 
 

210
meditation

డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది

ధ్యానం మన మానసిక ఆరోగ్యంపై గొప్ప ప్రభావాలను చూపుతుంది. ధ్యానంలో అతి ముఖ్యమైన భాగం మనస్సును కేంద్రీకరించడం, ఏకాగ్రత్తగా పనిచేయడం. ఇది మన ఆలోచనలను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాలు ప్రకారం.. ధ్యానం మెదడుపై యాంటి డిప్రెసెంట్స్ (Anti-depressants) లాగే ప్రభావాన్ని చూపుతుందని వెల్లడించాయి. 
 

310
meditation

ఆందోళనను తగ్గిస్తుంది

ఆందోళన (Anxiety) మానసికంగా, శారీరకంగా మనల్ని దెబ్బతీస్తుంది. ధ్యానం మనస్సును శాంతపరచడానికి, ప్రతికూల ఆలోచనలు (Negative thoughts), మనోభావాలను తగ్గించడానికి సహాయపడుతుంది. ధ్యానం రక్తపోటు (Blood pressure), శరీరంలోని ఇతర హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది . 
 

410

నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది
 
ధ్యానం ఒత్తిడి (Stress), ఉద్రిక్తత (Tension) మొదలైన భావాలను తగ్గిస్తుందని నిరూపించబడింది. ఇది మంచి నాణ్యమైన నిద్రను ప్రోత్సహిస్తుంది. రాత్రి పూట మంచిగా నిద్రపోవడం వల్ల  మనస్సుతో పాటు శరీరానికి కూడా గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. హాయిగా ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా నిద్రపోవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానంతో నిద్ర హాయిగా పడుతుంది. 

510

ఒత్తిడిని తగ్గిస్తుంది

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి సమస్య సర్వ సాధారణంగా మారింది. కుటుంబం, ఆఫీస్ పనులు అంటూ సవాలక్ష పనులతో ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి శరీరం, మనస్సుకు ప్రశాంతంగా, నిలకడగా ఉండనీయదు. అంతేకాదు ఈ ఒత్తిడి పనిలో ఏకాగ్రతను తగ్గించడంతో పాటుగా ఇతరులతో సంబంధాలకు కూడా ఆటంకం కలిగిస్తుంది. ధ్యానం ఒత్తిడిని తగ్గించడంతో పాటుగా సంతోషకరమైన మానసిక స్థితిని ప్రోత్సహిస్తుందని నిరూపించబడింది.

610

ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది

ధ్యానం ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.  రెగ్యులర్ గా ధ్యానం చేయడం వల్ల స్పష్టమైన మానసిక స్థితిని పొందుతారు. అలాగే మీ దృష్టిని కూడా మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ధ్యానం మన ఏకాగ్రత స్థాయిలను అడ్డుకునే ఆలోచనలు, భావాలను నివారించడానికి సహాయపడుతుంది. వాస్తవానికి ఏకాగ్రత, శ్రద్ధ తగ్గడానికి కారణమయ్యే మెదడు కార్యకలాపాలు ADD లేదా ADHD వంటి రుగ్మతలకు కారణమవుతాయి. అనేక ఇతర రుగ్మతల మాదిరిగానే ఈ రెండు రుగ్మతలను సరైన చికిత్స, ధ్యానం సహాయంతో తగ్గించుకోవచ్చు. 
 

710

మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది

ధ్యానం ఏకాగ్రతను పెంచడానికి సహాయపడుతుంది, అలాగే అనవసరమైన ఆలోచనలు రాకుండా చేయడానికి కూడా తోడ్పడుతుంది. ధ్యానం మన జ్ఞాపకశక్తి, శ్రద్ధ, ఇతర అంతర్గత మెదడు విధులను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. ధ్యానం అల్జీమర్స్ వంటి వృద్ధాప్య సంబంధిత రుగ్మతలతో కూడా పోరాడుతుంది. 

810

వ్యసనాన్ని వదిలిస్తుంది

ధ్యానం వ్యసనాన్ని వదిలించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. ధ్యానం స్వీయ నియంత్రణను పెంచుతుంది. వ్యసనం (Addiction) సమస్యలు శరీరంలో ఉద్రిక్తత (Tension)ను, మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో ఇబ్బందులను కలిగిస్తాయి. ధ్యానం స్వీయ ప్రతిబింబాన్ని పెంచడానికి, సంకల్ప శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది.
 

910
Meditation

సానుకూల మనోభావాలను పెంపొందిస్తుంది

ధ్యానం ఒత్తిడి, ఇతర రుగ్మతలను తగ్గించడమే కాకుండా, జీవితంపై మెరుగైన self-image ను పెంపొందించడానికి సహాయపడుతుందని నిరూపించబడింది. సైటోకైన్స్ వంటి వివిధ Inflammatory chemicals శరీరంలో నిరాశ, ఆందోళన వంటి సమస్యలను పుట్టిస్తాయి. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల శరీరంలో ఈ రసాయనాల ఉత్పత్తిని తగ్గించడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

1010

ధ్యానం మన మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఏదైనా ప్రతికూల లక్షణాలు లేదా రుగ్మతలను తగ్గిస్తుంది. మీ రోజువారీ దినచర్యలో కేవలం కొన్ని నిమిషాల ధ్యానాన్ని అలవరచుకోవడం వల్ల మీ మానసిక, భావోద్వేగ, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పైన చెప్పుకున్నట్టుగా ధ్యానం గుండె సంబంధిత సమస్యలను కూడా మెరుగుపరుస్తుందని నిరూపించబడింది.

Read more Photos on
click me!

Recommended Stories