Health Tips: మామిడి తొక్కతో ఒకటి కాదు రెండు కాదు.. ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

First Published Jun 27, 2022, 3:44 PM IST

Health Tips: పండ్లలో రారాజైన మామిడి పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న ముచ్చట చాలా మందికే తెలుసు. కానీ దీని తొక్క కూడా మనకు ఉపయోగపడుతుందన్న సంగతి ఎవరికైనా తెలుసా..? 
 

ఒక్క వేసవిలోనే పుష్కలంగా లభించే మామిడి పండ్లు మన  ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కేవలం రుచికోసమే కాదు.. ఈ పండ్లు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. వర్షాకాలం మొదలవడంతో  మామిడి పండ్లు దొరకడం కాస్త కష్టమే ఇక. సీజన్ పోతుందని జనాలు మామిడి పండ్లను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. అయితే చాలా మంది మామిడి పండును తినడానికి ముందు దాన్ని నీట్ గా కడిగి.. తొక్కను తీసేసి గుజ్జును మాత్రమే తింటుంటారు. ఇక దాని తొక్కను చెత్తబుట్టలో వేస్తుంటారు. కానీ మీకు తెలియని విషయం ఏమింటంటే.. మామిడి పండుతో పాటుగా మామిడి తొక్క కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

మామిడి పండును తొక్కలతో సహా తింటే పండు రుచి పోతుందని చాలా మంది తొక్కలను పారేస్తుంటారు. వారు లోపలి గుజ్జు ను మాత్రమే తింటారు. అదే మామిడిపండు ఒక్కటే ఉన్నప్పుడు చాలా మంది దీనిని తొక్కతో సహా తింటుంటారు. అయితే మామిడి పండ్లు తక్కువగా ఉన్నప్పుడే కాదు.. మామిడి పండ్లను ఎన్ని తిన్నా.. వాటిని తొక్కతో సహా తినేయడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

మామిడి తొక్క వల్ల కలిగే ప్రయోజనాలు:

యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు:  మామిడి తొక్కలో యాంటీ ఆక్సిడెంట్ (Antioxidant)లక్షణాలు ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ (Free radicals)వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. ముఖ్యంగా ఫ్రీ రాడికల్స్ వల్ల అవయవాలు దెబ్బతింటాయి.  కానీ మామిడి తొక్క అలాంటి సమస్యలేమీ రానీయదు. మామిడి తొక్క (Mango peel)కంటికి, గుండె (Heart)కు, చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

క్యాన్సర్ కు నివారణ:  ఇంతకు ముందు చెప్పినట్లుగా మామిడి తొక్క తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చాలా ఉంటాయి. ఇవి క్యాన్సర్ (Cancer)నుంచి మనల్ని రక్షిస్తుంది. మామిడి తొక్క ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung cancer), పెద్దప్రేగు క్యాన్సర్ (Colon cancer), మెదడు క్యాన్సర్ (Brain cancer), రొమ్ము క్యాన్సర్ (Breast cancer) నుంచి మనల్ని రక్షిస్తుంది. మామిడి తొక్కలో మొక్కలలో కనిపించే ఫైటో న్యూట్రియెంట్స్ (Phyto Nutrients) పుష్కలంగా ఉంటాయి. 
 

బరువు తగ్గడానికి సహాయపడుతుంది:  బరువు తగ్గాలనుకుంటే మామిడి పండుతో పాటుగా తొక్కను కూడా తినాలి. దీని తొక్కలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారు తొక్కతో పాటుగా మామిడి పండ్లను కూడా తినాలి. 
 

ముడతలు నివారిణి: మామిడిపండ్లు ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా అందాన్నికూడా పెంపొందిస్తాయి. మామిడి తొక్కను తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి గ్రైండ్ చేయాలి. దీనికి రోజ్ వాటర్ (Rosewater) జోడించి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేస్తే ముఖంపై ముడతలు (Wrinkles)తగ్గుతాయి.

మొటిమలను తగ్గిస్తుంది: ముఖంపై మొటిమలు (Acne), మచ్చల (SpotsSpots)తో ఇబ్బంది పడుతున్నారా. అయితే మామిడి తొక్కను ఉపయోగించండి. ఇందుకోసం మామిడి తొక్కను మిక్స్ చేసి ఆ రసాన్ని మొటిమపై అప్లై చేయాలి. కొద్దిరోజుల్లోనే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. 

ఎరువు: ఇతర పండ్ల తొక్కలతో మిక్స్ చేసి మామిడి తొక్క నుంచి ఎరువును తయారు చేసుకోవచ్చు. ఇందులో విటమిన్లు, రాగి, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇది మొక్కలు సమృద్ధిగా పెరగడానికి సహాయపడుతుంది.

click me!