Mango Storage: మామిడి పండ్లు రెండు వారాలైనా పాడవకుండా ఉండాలంటే సింపుల్ చిట్కాలు

Published : May 17, 2026, 11:24 AM IST

Mango Storage: వేసవిలోనే మామిడి పండ్లు అధికంగా దొరుకుతాయి.  కొన్న మామిడి పండ్లు రెండంటే రెండు రోజుల్లోనే పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలు పాటించండి. మామిడి పండ్లను 15 రోజుల వరకు తాజాగా, పాడవకుండా నిల్వ ఉంటాయి.

PREV
14
తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?

వేసవి వచ్చిందంటే చాలు, ఇంట్లో మామిడి పండ్ల సువాసన నిండిపోతుంది. కానీ ఎంతో ఇష్టపడి, ఎక్కువ డబ్బులు పెట్టి కొన్న పండ్లు రెండు రోజుల్లోనే మెత్తబడి, కుళ్లిపోతే చాలా బాధగా ఉంటుంది. మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్లే మామిడి పండ్లు త్వరగా పాడైపోతాయి.  మామిడి పండ్లను రెండు వారాల పాటూ పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.

చాలామంది పూర్తిగా పండిన, మెత్తటి పండ్లనే ఎంచుకుని కొంటారు. కానీ కొద్దిగా దోరగా లేదా కాస్త గట్టిగా ఉన్న పండ్లను కొనడం ఉత్తమం. ఇవి ఇంట్లో నెమ్మదిగా పండుతాయి కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పండు మీద ఎలాంటి నల్ల మచ్చలు ఉంటే కొనకండి. అవి త్వరగా పాడైపోతాయి.

24
కాయలు, పండ్లు కలిపి ఉంచకండి

మామిడి పండ్లు సహజంగా 'ఇథిలీన్' అనే గ్యాస్‌ను విడుదల చేస్తాయి. ఈ గ్యాస్ వల్ల పండ్లు త్వరగా పండిపోతాయి. అందుకే పూర్తిగా పండిన మామిడి పండ్లను, పచ్చి కాయలను కలిపి ఉంచవద్దు. పండిన పండు విడుదల చేసే ఇథిలీన్, కాయలను కలిపి ఉంచితే అవి త్వరగా కుళ్లిపోయేలా చేస్తుంది. ఆపిల్, అరటిపండ్ల నుంచి కూడా మామిడి పండ్లను దూరంగా ఉంచాలి. 

34
గాలి బాగా తగిలేలా..

మామిడి పండ్లకు గాలి బాగా తగిలేలా ఉంచుకోవాలి. మార్కెట్ నుంచి తీసుకురాగానే ప్లాస్టిక్ కవర్ల నుంచి బయటపెట్టేయాలి. ప్లాస్టిక్ కవర్లో ఉంచితే లోపల వేడి పెరిగి పండ్లు చెమట పడతాయి. దీనివల్ల బ్యాక్టీరియా చేరి పండు త్వరగా మెత్తబడుతుంది. పండ్లను వెదురు బుట్టల్లో లేదా గాలి ఆడే చెక్క పెట్టెల్లో ఉంచడం మంచిది. నేలపై పేపర్ వేసి, దానిపై పండ్లను విడివిడిగా పెట్టడం కూడా మంచి పద్ధతే.

44
నీటితో కడగవద్దు

పండ్లను నిల్వ చేసే ముందు ఎప్పుడూ నీటితో కడగకండి. తేమ ఉంటే ఫంగస్ లేదా బూజు పట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు పండ్లను త్వరగా పండించాలనుకుంటే, వాటిని బ్రౌన్ పేపర్ బ్యాగ్‌లో ఉంచండి. అదే ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే, ఒక్కో పండును విడివిడిగా న్యూస్ పేపర్ లేదా టిష్యూ పేపర్‌లో చుట్టి పెట్టండి. ఇది పండులోని అదనపు తేమను పీల్చుకుంటుంది.

చాలా మంది చేసే సాధారణ తప్పు ఏంటంటే, పచ్చిగా లేదా పూర్తిగా పండని మామిడికాయలను ఫ్రిజ్‌లో పెట్టడం. పండ్లు పూర్తిగా పండే వరకు వాటిని గది ఉష్ణోగ్రత (Room Temperature) వద్దే ఉంచాలి. పూర్తిగా పండిన తర్వాత మాత్రమే ఫ్రిజ్‌లో పెట్టాలి. ఫ్రిజ్‌లో పెట్టేటప్పుడు కూడా ఒకదానిపై ఒకటి వేయకుండా, టిష్యూ పేపర్‌లో చుట్టి వెజిటబుల్ బాక్స్‌లో పెడితే 5-7 రోజుల వరకు తాజాగా ఉంటాయి. అలాగే, పెట్టిన మామిడి పండ్లను రోజుకొకసారి మెల్లగా తిప్పుతూ ఉండండి. ఒకేచోట ఎక్కువ రోజులు ఉంచితే ఆ భాగంపై ఒత్తిడి పడి పండు మెత్తబడి పాడవ్వొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories