Seeds: బాదం, జీడిపప్పులే కాదు ఈ గింజలూ ప్రతిరోజూ తింటే ఊహించని ప్రయోజనాలు

Published : Aug 12, 2026, 07:05 PM IST

Seeds: బాదం, జీడిపప్పులు, వాల్ నట్స్, గుమ్మడి గింజలు వంటివే ఎక్కువమంది తింటూ ఉంటారు. కానీ పొద్దుతిరుగుడు గింజల్లో కూడా పోషకాలు నిండుగా ఉంటాయి. రోజూ గుప్పెడు తింటే చాలు శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి.

PREV
13
పోషకాలతో నిండిన సన్ ఫ్లవర్ సీడ్స్

గుమ్మడి గింజలు, బాదం, జీడిపప్పులాగే పొద్దుతిరుగుడు గింజలను కూడా ప్రతిరోజూ గుప్పెడు తినాల్సిన అవసరం ఉంది. ఇవి పోషకాలతో నిండి ఉంటాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, జింక్ పుష్కలంగా ఉంటాయి. పొద్దుతిరుగుడు గింజల్లోని అసంతృప్త కొవ్వులు, మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. సమతుల్య ఆహారంలో వీటిని చేర్చుకోవడం మంచిది. వీటిని నల్లని పొట్టుతో తినవచ్చు. లేదా పొట్టు తీసేస్తే ఇవి తెల్లగా ఉంటాయి.

23
సన్ ఫ్లవర్ సీడ్స్‌లో విటమిన్ ఇ, జింక్

పొద్దుతిరుగుడు గింజల్లో ఉండే విటమిన్ ఇ, జింక్ వంటి పోషకాలు శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి అవసరం. ఇవి కణాలను నష్టం నుండి కాపాడతాయి. విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే పొద్దుతిరుగుడు గింజలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. ఇవి చర్మానికి సహజమైన నిగారింపును అందిస్తాయి.

33
పొద్దుతిరుగుడు గింజలను ఎలా తినాలి?

ఈ గింజలను నేరుగా తినొచ్చు లేదా సలాడ్లు, ఓట్స్, పెరుగు వంటి వాటిపై చల్లుకుని కూడా తినొచ్చు. రోజుకు మితంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. పెద్దలే కాదు పిల్లలు కూడా వీటిని తినొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories