Apple: యాపిల్ కోయగానే కాసేపటికే నల్లగా అయిపోతాయి. లంచ్ బాక్సులోనో, డిన్నర్ లోనూ పెట్టుకుని వెళ్తే...వాటిని చూస్తే తినాలనిపించదు. ఇది ప్రతి ఒక్కరికీ ఉండే సమస్య. వాటి వల్ల నష్టం లేకపోయినా తినడానికి ఇష్టపడరు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఇలా ట్రై చేయండి.
యాపిల్ కోసినా నల్లగా మారకుండా ఉండాలంటే ఇలా చేయండి. ఒక పాత్రలో చల్లటి నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలపాలి. తర్వాత యాపిల్ ముక్కలను ఆ నీటిలో కొన్ని నిమిషాలు నానబెట్టి తీసేయాలి. ఇలా చేస్తే ముక్కలు ఎక్కువసేపు తాజాగా కనిపిస్తూ, వాటి సహజ రంగు అలాగే ఉంటుంది.
25
తేనె నీళ్లు
కోసిన యాపిల్ ముక్కలు ఫ్రెష్ గా ఉండాలంటే గ్లాసు నీటిలో కొద్దిగా తేనె వేసి బాగా కలపాలి. తర్వాత యాపిల్ ముక్కలను ఆ నీటిలో కలిపి ఒకటి రెండు నిమిషాలు ఉంచి బయటకు తీయాలి. ఇలా చేస్తే యాపిల్‌పై గాలి ప్రభావం తగ్గి, ముక్కలు ఎక్కువసేపు తెల్లగా, తాజాగా కనిపిస్తాయి.
35
ఉప్పు నీళ్లు
యాపిల్ ముక్కలు నల్లబడకుండా ఉండేందుకు ఉప్పు నీళ్లను కూడా వాడొచ్చు. ఒక గ్లాసు చల్లటి నీటిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపండి. ఆ నీటిలో యాపిల్ ముక్కలను ముంచి తీస్తే సరి.