టైట్ లెగ్గింగ్ లను వేసుకుంటున్నారా? ఈ సమస్యలొస్తయ్ జాగ్రత్త..

Published : Oct 19, 2022, 04:07 PM IST

చర్మానికి అత్తుక్కుపోయే డ్రెస్ లు చూడటానికి అందంగా కనిపించినా.. వీటివల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోజూ టైట్ లెగ్గింగ్ లను వేసుకోవడం వల్ల లేని పోని రోగాలు వస్తాయి తెలుసా..  

PREV
17
టైట్ లెగ్గింగ్ లను వేసుకుంటున్నారా? ఈ సమస్యలొస్తయ్ జాగ్రత్త..

ఫ్యాషనబుల్ దుస్తులు వేసుకోవడం అసలు తప్పే కాదు.. కానీ వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయి.. నష్టాలేమున్నాయి.. వంటి విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. లేదంటే తర్వాత బాధపడాల్సి వస్తది. ఈ రోజుల్లో టైట్ ఫిట్ దుస్తులు వేసుకునే వారి సంఖ్య భాగా పెరిగిపోయింది. ముఖ్యంగా అమ్మాయిలు... మరీ టైట్ గా ఉంటే టాప్స్, లెగ్గింగ్స్, ప్యాంట్స్, బ్లౌజులను వేసుకుంటుంటారు. వీటివల్ల మీకు కంఫర్ట్ గా అనిపించినా.. మీరు అందంగా కనిపించినా.. ఇవి ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఎందుకంటే మరీ టైట్ గా ఉండే బట్టల వల్ల  మీ చర్మం, రక్త ప్రవాహం ప్రభావితం అవుతాయి. 

27

టైట్ గా ఉండే వాటిలోనే అందంగా ఉంటారు అన్న ధోరణి చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిల్లో.. టైట్ గా ఉండే బట్టలను వేసుకున్న తర్వాతే చాలా కంఫర్ట్ గా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. ఇంచ్ లూజ్ గా ఉన్నా.. దానిని అస్సలు వేసుకోరు. ముఖ్యంగా వెయిట్ ఎక్కువగా ఉండే వారే ఇలాంటి బట్టలు వేసుకుంటుంటారు. లూజ్ గా ఉండే బట్టలను వేసుకుంటే మరింత లావుగా కనిపిస్తామని ఇలా చేస్తారు. వీరితో పాటుగా బక్కగా ఉండే వారు కూడా ఇలాంటి దుస్తులనే ఎక్కువగా వేసుకుంటుంటారు. ఆఫీస్ నుంచి జిమ్ కు వెళ్లే ప్రతి ఒక్కరూ లెగ్గింగ్ లనే ఎక్కువగా వేసుకుంటుంటారు. లెగ్గింగ్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం పదండి..  

37

వెన్నునొప్పి: టైట్ గా ఉండే దుస్తులను వేసుకోవడం వల్ల వెన్ను నొప్పి వస్తుంది. ఎందుకంటే బిగుతైన దుస్తులు మీ కండరాలపై ఒత్తిడిని పెంచుతాయి. దీంతో పొత్తి కడుపు నొప్పి, వెన్ను నొప్పి, తుంటి నొప్పి వస్తుంది. 

47

చర్మ సమస్యలు:  బిగుతైన బట్టలను వేసుకుంటే మీ శరీరానికి అవి పూర్తిగా అత్తుక్కుపోతాయి. ఇది కొన్నిసార్లు ఎన్నో చర్మ సమస్యలకు దారితీస్తుంది. అంటే టైట్ డ్రెస్ లను వేసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురద వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా బిగుతుగా ఉండే దుస్తులను వేసుకుంటే శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. 

57

చెమట ఎక్కువగా పడుతుంది: శరీరానికి చెమట పట్టడం సాధారణ విషయమే. కానీ లెగ్గింగ్ వల్ల చెమట మరీ ఎక్కువగా పడుతుంది. దీనివల్ల ఒంట్లో ఉండే నీటి స్థాయిలు తగ్గిపోతాయి. దీంతో మీ శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. అలాగే రాషెస్ వస్తాయి. అందుకే బిగుతుగా ఉండే బట్టలను వేసుకోకండి. 

67

రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది: బిగుతుగా ఉండే బట్టలు వేసుకోవడం వల్ల స్కిన్ కుంచించుకుపోతుంది. ఫలితంగా రక్తనాళాల్లో రక్త ప్రసరణ తగ్గడం మొదలవుతుంది. దీనివల్ల మీ శరీరం బాగా  అలసిపోయినట్టు అనిపిస్తుంది. దీనివల్ల మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. 
 

77

ఉబ్బిన రక్తనాళాలు: బిగుతుగా ఉండే బట్టలను వేసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది. దీనివల్లే చర్మంపై నీలి రక్త నాళాలు కనిపిస్తాయి. దీనిని వైద్య పరిభాషలో varicose veins అని అంటారు.

Read more Photos on
click me!

Recommended Stories