ఎర్ర బెండకాయతో పది కాలాలపాటు గుండెను పదిలంగా కాపాడుకోండిలా?

First Published Oct 19, 2022, 2:53 PM IST

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క రంగంలోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకోవడమే కాకుండా అత్యుత్తమమైన టెక్నాలజీని ఉపయోగించుకొని ఎన్నో వెరైటీలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యవసాయ రంగంలో కూడా ఈ మార్పు రావడంతో ఎన్నో రకాల వెరైటీ కూరగాయలను పండిస్తున్నారు. ఇలా కొత్త వంగడాలలో ఒకటిగా పేరు పొందినది ఎర్ర బెండకాయ. మరి ఎర్ర బెండకాయల వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం...
 

సాధారణంగా మనం ఆకుపచ్చ రంగులు ఉన్నటువంటి బెండకాయలను చూసి ఉంటాం కానీ ఎర్ర బెండకాయలు చాలా అరుదుగా ఉంటాయి. అయితే అరుదుగా ఉండే ఈ బెండకాయలలో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి.ఎర్ర బెండకాయల ఖరీదు ఎక్కువ అయినప్పటికీ మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. 
 

ఇందులో పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. వీటితోపాటు థయామిన్, రిబోఫ్లోవిన్, నియాసిన్, విటమిన్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఎర్ర బెండకాయలలో క్యాలరీలో పిండి పదార్థాలు తక్కువగా ఉండటం వల్ల ఈ ఎర్ర బెండకాయలు గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎర్ర బెండకాయలో సాల్యుబుల్ ఫైబర్స్ సమృద్ధిగా ఉండి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రక్తప్రసరణ వ్యవస్థ కూడా మెరుగుపడటంతో ఎలాంటి గుండె జబ్బులు రాకుండా ఉంటుంది.
 

ఇందులో ఉన్నటువంటి పాలీ ఫినాల్స్ ఫ్లవనాయి కారణంగా అలసట నీరసం తొలగిపోవడమే కాకుండా శారీరకంగా ఎంతో దృఢంగా తయారవుతారు.ఇకపోతే ఇందులో ఉండే విటమిన్ల కారణంగా కంటి చూపు మెరుగపడటమే కాకుండా ఏ విధమైనటువంటి చర్మ సమస్యలు కూడా దరికి చేరకుండా ఉంటాయి.ఇక ఈ బెండకాయలలో పిండి పదార్థాలు పూర్తిగా తక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో గ్లూకోస్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
 

ఈ విధంగా గ్లూకోస్ స్థాయిలు నియంత్రించడం వల్ల మధుమేహ వ్యాధికి దూరంగా ఉండవచ్చు. ఇందులో ఉన్నటువంటి క్యాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి పదార్థాలు మన శరీరంలో ఎముకలను దృఢ పరచడానికి మన శరీరంలో జీవ క్రియలు సక్రమంగా పనిచేయడానికి దోహదపడతాయి. ఇలా సాధారణ బెండకాయలతో పోలిస్తే ఈ ఎర్ర బెండకాయలు అధిక శాతం ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి కనుక వీటి ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.

click me!