ఆరోగ్యకరమైన ఆహారం, బరువు
బరువుకు, రొమ్ము క్యాన్సర్ ప్రమాదానికి దగ్గరి సంబంధం ఉందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల కలిగే మంట కణితి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే శరీరంలోని క్యాన్సర్ కణాలకు సహాయపడుతుంది కూడా. అందుకే బరువు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం తాజా, ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి.