చర్మం కాలడం (Skin burn)
మీరు నేరుగా ఐస్ ముఖానికి ఎక్కువసేపు రాసుకుంటే, చర్మం కాలినట్టు అవుతుంది. దీన్ని ఫ్రాస్ట్ బైట్ అంటారు. దీనివల్ల చర్మం తిమ్మిరిగా, ఎర్రగా అవుతుంది, లేదా బొబ్బలు కూడా వస్తాయి.
తేమ తగ్గిపోవడం (Moisture loss)
ఐస్ చర్మంలోని సహజ తేమను పీల్చుకుంటుంది. ఎక్కువగా ఐస్ రాసుకుంటే చర్మం పొడిబారి, సున్నితంగా అవుతుంది, ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి. కాబట్టి మీ చర్మం సున్నితంగా ఉంటే, నేరుగా ఐస్ రాసుకోకండి.
రక్తనాళాలకు నష్టం (Damage to blood vessels)
ఐస్ మీ చర్మానికి హాని కలిగిస్తుంది. ఐస్ చల్లదనం వల్ల ముక్కు, బుగ్గలపై ఉండే సున్నితమైన పొరలు దెబ్బతింటాయి, దీనివల్ల చర్మంపై ఎర్రటి మచ్చలు వస్తాయి.
మొటిమలు పెరగడం (Increase in breakouts)
ఐస్ రాసుకుంటే చర్మానికి వెంటనే ఉపశమనం కలుగుతుంది, కానీ చర్మంపై చెమట, దుమ్ము, లేదా మేకప్ ఉంటే, ఐస్ రాసుకుంటే రంధ్రాలలోకి వెళ్లి మొటిమలు వస్తాయి.